బీసీసీ నిబంధనలు పాటించలేను.. తాళం వేసుకుని ఇంట్లో కూర్చోలేను: బెంగాల్ కోచ్

ABN , First Publish Date - 2020-08-05T01:40:46+05:30 IST

కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, విధులకు హాజరు కావద్దని...

బీసీసీ నిబంధనలు పాటించలేను.. తాళం వేసుకుని ఇంట్లో కూర్చోలేను: బెంగాల్ కోచ్

కలకత్తా: కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, విధులకు హాజరు కావద్దని బీసీసీఐ సూచించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బెంగాల్ కోచ్ అరుణ్‌ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వయసు 65 అయినంత మాత్రాన ఇంటికే పరిమితం కానని చెప్పారు. ‘దేశ ప్రధాని నరేంద్ర మోదీ వయసు కూడా 69 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన దేశాన్నే నడిపిస్తున్నారు. ఆయనను విధుల నుంచి తప్పుకోమని చెప్పగలరా..? లేదు కదా.. అలాగే నాకు కూడా చెప్పకండి. 65 ఏళ్ల వయసు ఉన్నంత మాత్రాన ఓ గదిలో కూర్చుని తాళం వేసుకుని ఉండలేను’ అంటూ అరుణ్ లాల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-05T01:40:46+05:30 IST