బెంగాల్ ప్రముఖ జర్నలిస్టు కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-17T14:54:17+05:30 IST

ప్రముఖ జర్నలిస్ట్, జీ 24 గంటలు ఎడిటర్ గా పనిచేసిన బందోపాధ్యాయ్ కరోనాతో ...

బెంగాల్ ప్రముఖ జర్నలిస్టు కరోనాతో మృతి

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): ప్రముఖ జర్నలిస్ట్, పలు టీవీ ఛానళ్లలో ఎడిటర్ గా పనిచేసిన బందోపాధ్యాయ్ కరోనాతో ఆదివారం రాత్రి ఆసుపత్రిలో మరణించారు. 56 ఏళ్ల అంజన్ బందోపాధ్యాయ్ కు నెలక్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని కోల్ కతాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మరణించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అంజన్ ఇంటికి వెళ్లాక మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు.దీంతో అంజన్ ను మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చి వెంటిలేటరుపై ఉంచామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బందోపాధ్యాయ్ ఈటీవీ బంగ్లా, జీ 24 గంటలు, టీవీ9 బంగ్లా, ఆనందబజార్ పత్రిక డిజిటల్ యూనిట్ విభాగాల్లో పనిచేశారు. 


బెంగాల్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ సోదరుడు. అంజన్ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతాబెనర్జీ విచారం వ్యక్తం చేశారు. డైనమిక్ జర్నలిస్టును కోల్పోయామని ముఖ్యమంత్రి విడుదల చేసిన సంతాప ప్రకటనలో తెలిపారు. బందోపాధ్యాయ భార్య ఆదితి, కుమార్తె  టిట్లిలకు సీఎం మమతా సంతాపం తెలిపారు. కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్ అంజన్ బందోపాధ్యాయ మరణానికి సంతాపం తెలిపింది.

Updated Date - 2021-05-17T14:54:17+05:30 IST