బెంగళూరులో అదృశ్యం.. మంగళూరులో ప్రత్యక్షం...

ABN , First Publish Date - 2021-10-13T16:55:09+05:30 IST

నగరంలోని సోలదేవనహళ్లిలో రెండు రోజులక్రితం కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. స్థానిక ఏజీబీ లేఅవుట్‌లోని క్రిటన్‌ కుశాల్‌ అపార్ట్‌మెంట్‌కు చెం

బెంగళూరులో అదృశ్యం.. మంగళూరులో ప్రత్యక్షం...

బెంగళూరు: నగరంలోని సోలదేవనహళ్లిలో రెండు రోజులక్రితం కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. స్థానిక ఏజీబీ లేఅవుట్‌లోని క్రిటన్‌ కుశాల్‌ అపార్ట్‌మెంట్‌కు చెందిన బీసీఏ విద్యార్థిని అమృతవర్షిణి (21), రాయన్‌ సిద్దార్థ (12), చింతన్‌ (12), భూమి (12)ను బెంగళూరుకు వాపసు తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం ఈ నలుగురూ బెంగళూరు నుంచి మంగళూరుకు బస్సులో వెళ్లారు. అక్కడికి వెళ్లి ఒక అడ్ర్‌సను వెతకసాగారు. వీరిని గమనించిన ఒక ఆటో డ్రైవర్‌ వారి పరిస్థితిని ఆలకించాడు. వీరి గురించి మీడియాలో వచ్చినట్టు గుర్తించి పోల్చుకున్నాడు. అనంతరం తన ఆటోలో వారిని పాండేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పాండేశ్వర పోలీసులు వారిని ఆత్మీయంగా పలకరించి టిఫిన్‌ ఇచ్చారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు గల కారణాలను ఆరా తీశారు. ఇంట్లోవారు ట్రిప్‌ వెళ్లేందుకు అంగీకరించలేదని, చివరకు మిత్రులంతా కలసి వాకింగ్‌ పేరిట ఇంట్లో నుంచి బయటకు వచ్చామన్నారు. కాగా ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్న వర్షిణి 70 గ్రాముల బంగారు గొలుసు, రూ. 3 వేల నగదు తీసుకెళ్లింది. ఈ విషయం కూడా అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు ముందుగానే సమాచారం చేరింది. బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు నాలుగు బృందాలుగా బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలో ఆరా తీశారు. చివరకు వీరి ట్రిప్‌ గురించి నిర్ధారించుకున్నాక బీదర్‌, బళ్లారి, మండ్య పోలీసులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు మంగళూరులో విద్యార్థులు లభించడంతో కథ సుఖాంతమైంది. 

Updated Date - 2021-10-13T16:55:09+05:30 IST