Abn logo
Sep 19 2021 @ 12:15PM

బెంగళూరులో.. రాత్రి 10 వరకు మెట్రో రైళ్లు

బెంగళూరు: బెంగళూరు నగరంలో మెట్రో రైళ్ళు రాత్రి 10 గంటల వ రకు సంచరించనున్నాయి. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) నగరంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో రైళ్ళ సంచారం రాత్రి 10 వరకు కొనసాగుతుందని, అన్ని మార్గాల్లోనూ ప్రతి పది నిముషాలకో రైలు అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. నగరానికి చెందిన ఎంపీలు, పలువురు మంత్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ నియమాలను కట్టుదిట్టంగా పాటిస్తూ మెట్రో రైళ్ళలో ప్రయాణించాలని ప్రయాణికులకు బీఎంఆర్‌సీఎల్‌ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7వరకు మెట్రో సంచారం ఉన్న సంగతి తెలిసిందే.