విదేశీ వనితలతో వ్యభిచారం...ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2020-12-09T15:39:20+05:30 IST

విదేశీ వనితలతో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు....

విదేశీ వనితలతో వ్యభిచారం...ముఠా గుట్టురట్టు

బెంగళూరు (కర్ణాటక): విదేశీ వనితలతో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి నలుగురు విదేశీ వనితలతో వ్యభిచారం సాగిస్తుండగా తమ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసు బృందం దాడులు చేసిందని బెంగళూరు పోలీసు జాయింట్ కమిషనర్ చెప్పారు. వ్యభిచారం రాకెట్ నుంచి నలుగురు విదేశీ మహిళలను పోలీసులు కాపాడారు. విదేశీ మహిళలను మహిళా సదనానికి తరలించారు. 


గత కొంత కాలంగా విదేశీ మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు చెప్పారు. దీంతోపాటు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన ఓ ముఠాను తాము అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి రూ.4.5లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. 

Updated Date - 2020-12-09T15:39:20+05:30 IST