Abn logo
Aug 3 2021 @ 19:34PM

పుట్టిన రోజుకు కొత్త డ్రెస్ కొనలేదని టీనేజర్ ఆత్మహత్య

బెంగళూరు: పుట్టిన రోజు కోసం తల్లిదండ్రులు కొత్త డ్రెస్ కొనివ్వలేదన్న ఆగ్రహంలో ఓ టీనేజ్ బాలిక(16) ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ రోజు కూలీలు. కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా వారి ఆర్థిక స్థితి దెబ్బతింది. దీంతో.. వారు తమ కూతురి కోరిక తీర్చలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. అయితే..ఇవేవీ అర్థం చేసుకోలేని అపరిపక్వత, తొందరపాటు బాలికను ఆత్మహత్యకు పురిగొల్పాయి. దీంతో.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. శహకార్ నగర్‌లో ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసించేది. సోమవారం ఆమె పుట్టినరోజు కాగా ఆదివారం ఆమె ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకుంది.