కోలాహలంగా బెర్లిన్ ‘ఫెస్టివల్’…

ABN , First Publish Date - 2021-06-21T23:53:00+05:30 IST

కరోనా తగ్గుముఖం పట్టడంతో యూరప్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

కోలాహలంగా బెర్లిన్ ‘ఫెస్టివల్’…

బెర్లిన్ : కరోనా తగ్గుముఖం పట్టడంతో యూరప్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కొద్ది నెలలుగా జర్మనీలో ఆంక్షలను సడలిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో...  బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. ఎప్పుడూ వింటర్ లో నిర్వహించే ఈ సినీ సంబరాన్ని ఈ దఫా మాత్రం వేసవిలో ఏర్పాటు చేశారు. 


కాగా... ఎండలు తారస్థాయిలో ఉండడంతో ఆడియన్స్, జ్యూరి సభ్యులు పలు చిత్రాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. కాగా... ‘హర్ బచ్ మాన్’ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మెప్పు పొంది అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ‘హర్ బచ్ మాన్’ సినిమా...  ఓ టీచర్  తాలూకు ఆరో తరగతి విద్యార్థుల చుట్టూ తిరిగే డాక్యుమెంటరీ. 


ఇక రెండో స్థానంలో ‘ఐ యామ్ యువర్ మ్యాన్’ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ నిలిచింది. మూడో ఉత్తమ చిత్రంగా ఇరాన్ డ్రామా మూవీ ‘బల్లాడ్ ఆఫ్‌ ఏ వైట్ కౌ’ ప్రశంసలు అందుకుంది. ‘2021 పనోరమా ఆడియన్స్ అవార్డ్’ విభాగంలో మరికొన్ని చాత్రాలకు బెర్లిన్ ఫెస్టివల్ లో పురస్కారాలను ప్రకటించారు. ‘ద లాస్ట్ ఫారెస్ట్’ తొలి ఉత్తమ చిత్రంగా, ‘మిగ్యుయెల్స్ వార్’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ‘జెండరైజేషన్’ థర్డ్ బెస్ట్ మూవీగా జనం దృష్టిని ఆకర్షించాయి.

Updated Date - 2021-06-21T23:53:00+05:30 IST