ఇవి చైనా ఫోన్లకు దీటైనవి

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

‘చైనా ఉత్పత్తులు వద్దు. చైనాకి గుణపాఠం చెప్పాలి’ వంటి నినాదాలు దేశవ్యాప్తంగా పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల వాటా దాదాపు 70 శాతం. అయితే చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా...

ఇవి చైనా ఫోన్లకు దీటైనవి

‘చైనా ఉత్పత్తులు వద్దు. చైనాకి గుణపాఠం చెప్పాలి’ వంటి నినాదాలు దేశవ్యాప్తంగా పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల వాటా దాదాపు 70 శాతం. అయితే చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా, అందుబాటు ధరల్లో ఉన్న  ఇతర స్మార్ట్‌ ఫోన్ల గురించి చాలామంది వెతుకుతున్నారు. అలాంటి కొన్ని మీడియమ్‌ రేంజ్‌ ఫోన్ల వివరాలివి...




నోకియా 2.3 

2 జిబి ర్యామ్‌, 32 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మోడల్‌ ఇది. మెమరీ కార్డు ద్వారా అదనపు స్టోరేజ్‌ పొందొచ్చు. 6.2 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే మీడియా టెక్‌ హీలియో  ఏ 22 ప్రాసెసర్‌ని ఇది కలిగి ఉంటుంది. ఫోన్‌ వెనుక భాగంలో 13 మరియు 2 మెగాపిక్సల్‌ కెమెరాలు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ నిక్షిప్తం చేయబడింది. ఽనోకియా ఫోన్ల నుండి సహజంగా ఆశించే మెరుగైన బిల్డ్‌ క్వాలిటీ ఈ ఫోన్‌లో పొందొచ్చు. దీని ధర రూ. 7,999.


సామ్‌సంగ్‌ ఎం10 ఎస్‌


సామ్‌సంగ్‌ స్వయంగా తయారు చేసిన ఎక్సినోస్‌   7884బి ప్రాసెసర్‌ ఆధారంగా పని చేస్తుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటాయి. ఈ ఫోన్‌లో హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ కలిగిన అమోల్డ్‌ డిస్‌ప్లే ఉండటం అదనపు ప్రత్యేకత. దీని ధర రూ. 8,999. ఈ ధరలో అమోల్డ్‌ డిస్‌ప్లే ఉన్న ఫోన్లు ఇతర కంపెనీలో దొరకవు. దీనిలో 13 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్‌ అలా్ట్ర వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంటాయి. 8 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా. 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కలిగి ఉన్న ఈ ఫోన్‌ ఒక మాదిరి అవసరాలకు మాత్రమే అనువుగా ఉంటుంది. 



సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం31

6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరా, 8, 5, 5 ఎంపీ రిజల్యూషన్‌ కలిగిన మరో మూడు కెమెరాలు, ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా ఉంటాయి. దీన్ని 20 వేల రూపాయల లోపు లభించే మెరుగైన ఫోన్‌ అని చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 17,499



పానసానిక్‌ ఎల్యుగ 16


2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 5.45 అంగుళాల స్ర్కీన్‌ ఉంటుంది. మెమరీ కార్డు ద్వారా 256 జీబీ వరకూ పొందవచ్చు. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటాయి. ధర రూ. 6799. ఇదే కంపెనీకి చెందిన ఎల్యుగ 18 మోడల్‌ ఫోన్‌ కూడా ఉంది. దీంట్లో 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటాయి. 6.22 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే ఉంటుంది. 3000 ఎంఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఫీచర్ల పరంగా ఈ ఫోన్‌ అంతగా ఆకట్టుకోదు. దీని ధర రూ.9,199.




ఎల్‌జీ డబ్ల్యు 30


దీంట్లో అరోరా గ్రీన్‌ మోడల్‌ రూ. 9800  లకు లభిస్తుంది. 6.26 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో పాటు, మీడియా టెక్‌ హీలియో పి22 ప్రాసెసర్‌ దీంట్లో ఉంటుంది. ఫోన్‌ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సల్‌ మరో కెమెరా,  2 ఎంపి డెప్త్‌సెన్సార్‌ ఉంటాయి. 16 మెగా పిక్సల్‌ సెల్ఫీల కెమెరా ఉంటుంది.  32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  3 జీబీ ర్యామ్‌, 256 జీబీ వరకు మెమరీ కార్డు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో చెప్పుకోదగ్గ అంశం. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ. మామూలు అవసరాలకు ఒకటిన్నర రోజులపాటు బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుంది.



సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ10ఎస్‌

3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ ఫోన్‌ మోడల్‌ 10,990 రూపాయలకు లభిస్తోంది. మీడియా టెక్‌ ఎంటి6762 ప్రాసెసర్‌, 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో ఇది వస్తుంది. ఫోన్‌ వెనుక భాగంలో 13, 2 మెగా పిక్సల్‌ రిజల్యూషన్‌ కలిగిన రెండు కెమెరాలు, 8 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ  4000 ఎంఎహెచ్‌. బడ్జెట్‌ వినియోగదారులకు సామ్‌సంగ్‌ నుంచి ఒక మెరుగైన ఫోన్‌గా దీన్ని భావించవచ్చు.


సాంసంగ్‌ గెలాక్సీ ఎం11

6.4 అంగుళాల డిస్‌ప్లేతో, 5000 ఎంఎహెచ్‌ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో ఆకట్టుకుంటుందీ ఫోన్‌. వెనుక భాగంలో 13 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్‌ అలా్ట్ర వైడ్‌ కెమెరా, 2 మెగా పిక్సల్‌ డెప్త్‌ కెమెరా 48 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ లభిస్తాయి. అధునాతన డిజైన్‌, డిస్‌ప్లే క్వాలిటీ కోసం ఈ ఫోన్‌ ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర రూ. 10,999.


సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం21

6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ లభిస్తుంది. ఫోన్‌ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్‌ అలా్ట్రవైడ్‌ కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ ఉంటాయి. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ. 13,999.


ఎల్‌జీ డబ్ల్యు 30 ప్రొ

ఈ ఫోన్లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌  632 ప్రాసెసర్‌ లభిస్తోంది.  4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌   ఉంటుంది. 4050 ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, 6.21 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేని ఇది అందిస్తుంది. ఇంత ధర పెట్టినప్పుడు కేవలం హెచ్‌డి డిస్‌ప్లే ఉండటం నిరుత్సాహపరుస్తుంది. ఫోన్‌ వెనుక భాగంలో 13, 16, 5 మెగా పిక్సల్‌ కెమెరాలతో పాటు, ముందు భాగంలో 16 మెగా పిక్సల్‌ కెమెరా ఉంటుంది.  దీని ధర రూ. 15,999.


నల్లమోతు శ్రీధర్‌

-fb.com/nallamothu sridhar


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST