ప్రేమ విందు!

ABN , First Publish Date - 2020-02-13T04:57:20+05:30 IST

ప్రేమికుల రోజు దగ్గర పడుతోంది. మరి ఆ రోజు డేట్‌ నైట్‌ డిన్నర్‌ గురించి ప్లాన్‌ చేస్తున్నారా? ఏ రెస్టారెంట్‌ ఎంచుకోవాలి? అక్కడికి ఎలా చేరుకోవాలి? ఏమేం తినాలి?

ప్రేమ విందు!

ప్రేమికుల రోజు దగ్గర పడుతోంది. మరి ఆ రోజు డేట్‌ నైట్‌ డిన్నర్‌ గురించి ప్లాన్‌ చేస్తున్నారా? ఏ రెస్టారెంట్‌ ఎంచుకోవాలి? అక్కడికి ఎలా చేరుకోవాలి? ఏమేం తినాలి? అని ఆలోచించే ముందు, ఆ మొత్తం ప్రోగ్రామ్‌లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఊహించడం మేలు. వాహనాల రద్దీ తప్పించుకుని ఎలాగోలా రెస్టారెంట్‌ చేరుకున్నా అక్కడ వడ్డించే పదార్థాల్లో ఆరోగ్యానికి చేటు చేసేవే ఎక్కువ ఉంటాయి. మనసిచ్చిన వ్యక్తి ఆరోగ్యం పదిలంగా ఉండాలని కోరుకుంటే, ఇంట్లోనే వాలెంటైన్స్‌ డే ఫీస్ట్‌ వండి, వడ్డించవచ్చు. అందుకోసమే ఈ చిట్కాలు!


తీయని ప్రేమలో మునకలేసే ఆ మధుర క్షణాలు మరింత తీయగా మారాలంటే డార్క్‌ చాక్‌లెట్‌లో ముంచిన స్ర్టాబెర్రీలు తినిపించాలి. ఈ డిసర్ట్‌లోని యాంటీఆక్సిడెంట్లు గుండెను పదిలంగా ఉంచుతాయి.


బేకింగ్‌లో మైదాకు బదులుగా పొట్టుతోకూడిన గోధుమపిండి, వెన్నకు బదులుగా నూనె, మూడు వంతులు తక్కువ చక్కెర, వీలైతే కొవ్వుకు బదులుగా దాన్లో సగ భాగం పళ్ల గుజ్జు చేర్చాలి.


మనసిచ్చిన వ్యక్తి మీకోసం చాక్లెట్లు కొనవద్దని కూడా చెప్పండి.


వినోదాల్లో అదనపు రుచులను చవిచూడడం తప్పు కాదు. అయితే ఆ క్యాలరీలకు అదనపు వ్యాయామాలను జోడిస్తే సరిపోతుంది.


సన్నిహితంగా గడపడం కోసం దూరంగా ఉండే రెస్టారెంట్‌కు పరుగు తీసే బదులు, ఇంట్లో, క్యాండిల్‌ వెలుగులో ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రేమతో కొసరి కొసరి వడ్డించడంలో ఉండే ఆనందమే వేరు!


గులాబీ, ఎరుపు... ఆ రోజు వడ్డించే పదార్థాలు ఈ రంగుల్లో ఉంటే, ప్రేమికుల రోజు మరింత మనోరంజకంగా ఉంటుంది.


- జీనత్‌ ఫాతిమా, 

కన్సల్టెంట్‌ డైటీషియన్‌,

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.


Updated Date - 2020-02-13T04:57:20+05:30 IST