సుదూరం నుంచే కంట్రోల్‌కు బెస్ట్‌ రిమోట్‌ యాప్స్‌

ABN , First Publish Date - 2021-01-09T06:31:38+05:30 IST

సుదూరంలో లేదంటే వేరే దేశంలో ఉన్న స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కంప్యూటర్‌, ఫోన్లో ఉండే సందేహాలు తీర్చాలన్నా, వాటిలో ఎదురయ్యే సమస్యలు విషయంలో ట్రబుల్‌ షూట్‌ చేయాలన్నా రిమోట్‌

సుదూరం నుంచే కంట్రోల్‌కు బెస్ట్‌ రిమోట్‌ యాప్స్‌

సుదూరంలో లేదంటే వేరే దేశంలో ఉన్న స్నేహితులకు,  కుటుంబ సభ్యులకు కంప్యూటర్‌, ఫోన్లో ఉండే సందేహాలు తీర్చాలన్నా, వాటిలో ఎదురయ్యే సమస్యలు విషయంలో ట్రబుల్‌ షూట్‌ చేయాలన్నా రిమోట్‌ అడ్మినిస్ర్టేషన్‌ అప్లికేషన్స్‌ ఉపయోగపడుతూ ఉంటాయి.  వీటిలో చాలామందికి ఇప్పటికే టీం వ్యూయర్‌, ఎనీడెస్క్‌ వంటి  కొన్ని రకాల అప్లికేషన్స్‌ సుపరిచితమే. అయితే ఇదే కోవలో మరికొన్ని శక్తిమంతమైన రిమోట్‌ అడ్మినిస్ర్టేషన్‌ అప్లికేషన్స్‌ కూడా ఉన్నాయి.  




Supremo


ఇటీవలి కాలంలో బాగా పాపులర్‌ అయిన అప్లికేషన్‌ ఇది.  ఇతర అప్లికేషన్స్‌తో పోలిస్తే దీన్ని ఉపయోగించడం చాలా సులభం.  అన్నిటికంటే ముఖ్యంగా ఒకే కంప్యూటర్‌కి అనేకమంది యూజర్లు కనెక్ట్‌ అయ్యే విధంగా ఇది అవకాశం కల్పిస్తుంది. అలాగే కనెక్షన్‌ శక్తిమంతమైన ఎన్ర్కిప్షన్‌ కలిగి ఉన్నందున మధ్యలో హ్యాకర్లు కనెక్షన్‌ చేజిక్కించుకునే  అవకాశాలు చాలా తక్కువ.  ఇతర కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు టాబెట్ల నుంచి రిమోట్‌ కంప్యూటర్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.https://www.supremocontrol.com/ అనే  వెబ్‌సైట్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.





 TeamViewer


దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సుదీర్ఘకాలంగా అందరికీ సుపరిచితమైన అప్లికేషన్‌.  వాస్తవానికి దీని కంటే ముందే విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్‌ రిమోట్‌ డెస్క్‌టాప్‌ సదుపాయం ఉంది. అయితే, అది కొద్దిగా క్లిష్టతరంగా ఉండటంతో  దాదాపు పదిహేను సంవత్సరాలుగా డెస్క్‌టాప్‌ వినియోగదారులు ఈ  రిమోట్‌ అడ్మినిరేస్టషన్‌ టూల్‌ని  ఉపయోగిస్తున్నారు.  విండో్‌సతో పాటు మ్యాక్‌,  లైనెక్స్‌, ఐఓయస్‌, ఆండ్రాయిడ్‌ వంటి  అన్ని రకాల పాపులర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను ఈ అప్లికేషన్‌ సపోర్ట్‌ చేస్తుంది.  వాటికంటూ  ప్రత్యేకంగా క్లయింట్‌ యాప్స్‌ని  ఇది తన వెబ్‌సైట్లో అందిస్తోంది. 


దీంట్లో కూడా ఆటోమేటిక్‌గా కనెక్ట్‌ అయ్యే అవకాశంతో పాటు, అప్పటికప్పుడు వన్‌ టైం కనెక్షన్‌ తయారు చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. అయితే ఇది సుదీర్ఘ సమయం కనెక్షన్‌  కొనసాగించడానికి  ఉచిత వెర్షన్లో అనుమతించదు.  లైసెన్స్‌ కొనుగోలు చేయటం ద్వారా  అపరిమితమైన రిమోట్‌ సెషన్స్‌  సాధ్యపడతాయి.https://www.teamviewer.com/download/ అనే లింకులో ఇది లభిస్తుంది.




 Real VNC

సుదీర్ఘకాలంగా చాలా ప్రాచుర్యం చెందిన అప్లికేషన్‌ ఇది.  విండోస్‌, మ్యాక్‌, లైనక్స్‌  ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం వ్యక్తిగత అవసరానికి ఇది ఉచితంగా లభిస్తుంది.  మొబైల్‌ డివైజ్‌లకు కూడా  ఇది అందుబాటులో ఉంటుంది. పెయిడ్‌ వెర్షన్‌ ఎంపిక చేసుకున్న వారికి  కనెక్షన్‌ ఎన్‌క్రిప్ట్‌ చేయడం,  ఫైల్‌ ట్రాన్సఫర్‌, టెక్ట్స్‌, ఛాట్‌, ప్రింటింగ్‌ వంటి  అనేక ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. https://www.realvnc.com/  అనే సైట్‌ నుంచి దీనిని డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.




 Any Desk

టీమ్‌ వ్యూయర్‌ తరవాత  చాలా మందికి బాగా పరిచయం ఉన్న అప్లికేషన్‌ ఇది.  వాస్తవానికి టీమ్‌ వ్యూయర్‌ని  అభివృద్థి చేయడంలో పాలుపంచుకున్న  కొంతమంది డెవలపర్లు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టీమ్‌ వ్యూయర్‌తో పోలిస్తే  అనేక సందర్భాల్లో ఇది వేగంగా పనిచేస్తుంది. మిలిటరీ గ్రేడ్‌ టిఎల్‌ఎస్‌  టెక్నాలజీ ఆధారంగా సురక్షితమైన కనెక్షన్లను  ఇది మనకు అందిస్తుంది.

విండోస్‌, మ్యాక్‌, ఐఓయస్‌, ఆండ్రాయిడ్‌, లైనక్స్‌ వంటి  వివిధ రకాల ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను సపోర్ట్‌ చేసే విధంగా దీంట్లో క్లయింట్స్‌ లభిస్తున్నాయి. ఉచిత వెర్షన్‌తో పాటు  ఒకేసారి అనేక కంప్యూటర్లకి కనెక్ట్‌ అవగలిగే  సదుపాయం ఉన్న పెయిడ్‌ ప్లాన్లు దీంట్లో   లభిస్తుంటాయి.https://anydesk.com/   లింకు నుంచి దీన్ని డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.





Splashtop

ఒక విండోస్‌ కంప్యూటర్‌ని ఒక స్మార్ట్‌ ఫోన్‌ నుంచి రిమోట్‌గా  నియంత్రించేందుకు ఉపయోగపడే అప్లికేషన్‌ ఇది.   దీనికి సంబంధించిన సర్వర్‌ యాప్‌ని విండోస్‌ కంప్యూటర్లోనూ, క్లయింట్‌ యాప్‌ని  గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి  డౌన్‌లోడ్‌ చేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తదుపరి ఫోన్‌ నుంచి  వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్‌ని రిమోట్‌గా  నియంత్రించవచ్చు. https://www.splashtop.com/ అనే లింకు నుంచి దీన్ని పొందొచ్చు. దీంట్లో ఉచిత, పెయిడ్‌ వెర్షన్స్‌ కూడా  అందుబాటులో ఉన్నాయి.





Chrome Remote Desktop


ఇటీవలి కాలంలో దాదాపు అన్ని కంప్యూటర్లో మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ విరివిగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి నేటివ్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పనిలేదు. నేరుగా గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ నుంచి వేరే ప్రదేశంలో ఉన్న రిమోట్‌ కంప్యూటర్‌ని యాక్సెస్‌ చెయ్యడం కోసం క్రోమ్‌ రిమోట్‌ డెస్క్‌టాప్‌ గూగుల్‌ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఉపయోగపడుతుంది. 

దీనికోసం చేయాల్సిందల్లా గూగుల్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి  రెండు కంప్యూటర్‌లలోనూ Chrome Remote Desktop ఎక్స్‌టెన్షన్‌ను  ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుంది.  అయితే దీన్ని ఉపయోగించాలంటే కచ్చితంగా మీకు గూగుల్‌ అకౌంట్‌ఉండాలి.  అలాగే ఎవరు పడితే వారు మీ రిమోట్‌ కంప్యూటర్‌ యాక్సెస్‌ చెయ్యకుండా  సెక్యూరిటీ పిన్‌ సెట్‌ చేసుకునే  అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది.




Iperius Remote Desktop

ఇది పూర్తి ఉచితంగా లభించే రిమోట్‌ డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌.  అలాగే దీని కోసం ఎలాంటి రూటర్‌, ఫైర్‌వాల్‌ రూల్స్‌  మార్పిడి చేయాల్సిన పనిలేదు.  తక్కువ పరిమాణం కలిగి ఉండి,  వేగంగా పని చేసే అప్లికేషన్‌ ఇది.  అలాగే దీనిని కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ కూడా చేయాల్సిన పనిలేదు.  ఒక చిన్న ఫైల్‌ నుంచి  దీనిని సులభంగా రన్‌ చేసుకోవచ్చు.  విండోస్‌,  ఆండ్రాయిడ్‌, ఐఓయస్‌  ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే డివైజ్లని  ఇది సపోర్ట్‌ చేస్తుంది.  https://www.iperiusremote.com  అనే  వెబ్‌సైట్లో ఇది లభిస్తుంది.




Ammyy Admin

ఇది కూడా చాలామందికి పరిచయమైన అప్లికేషన్‌.  వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్‌ని రిమోట్‌గా నియంత్రించడం కోసం  ఇది ఉపయోగపడుతుంది.  సాంకేతిక సహాయం,  ఆన్లైన్‌ ప్రజంటేషన్స్‌  వంటి వివిధ అవసరాల కోసం దీనిని ఉపయోగించవచ్చు. టీం వ్యూయర్‌ మాదిరిగానే ఐడి, పాస్వర్డ్‌ ఆధారంగా రిమోట్‌ కంప్యూటర్‌కి  కనెక్ట్‌ అవడానికి అవకాశం కలుగుతుంది. https://www.ammyy.com/en/index.html అనే లింక్‌ నుంచి దీన్ని డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.




 Laplink Everywhere


ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాల్సిన పనిలేదు ఒక వెబ్‌ బ్రౌజర్‌,  ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..  ప్రపంచంలో ఉన్న ఏ డివైస్‌నైనా సులభంగా కంట్రోల్‌ చేసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.  రిమోట్‌ యాక్సె్‌సకి కావలసిన బేసిక్‌  సదుపాయాలన్ని దీంట్లో లభిస్తాయి.  ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా సులభంగా ఉపయోగించగలిగేలా  ఇది ఉంటుంది. https://web.laplink.com/product/

laplink-everywhere/  లో దీన్ని పొందొచ్చు.




మంచి రిమోట్‌ యాప్‌ను ఎలా సెలెక్ట్‌ చేసుకోవాలి?

రిమోట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అప్లికేషన్‌ని  మీ కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ కోసం ఎంపిక చేసుకునేటప్పుడు,  అది అన్ని రకాల ప్లాట్‌ఫాంలను సపోర్ట్‌ చేసేదిగా ఉండాలి.  ముఖ్యంగా అప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోండని  అవతలివారికి చెబితే సమయం వృధా అవుతుంది. కాబట్టి..  దాదాపు ప్రతి ఒక్కరి కంప్యూటర్లో, ఫోన్లో ఉండే టీమ్‌ వ్యూయర్‌ వంటి పాపులర్‌ యాప్స్‌ ద్వారా  పని వేగవంతమవుతుంది. అయితే  సుదీర్ఘకాలం కనెక్షన్‌  కావాలనుకున్నప్పుడు, ముఖ్యంగా టీమ్‌ వ్యూయర్‌ లాంటివి లైసెన్స్‌ ధర  భారీగా ఉన్నందున తక్కువ రేటుకు లభించే ఇతర అప్లికేషన్స్‌ లైసెన్స్‌ కొనుగోలు చేయడం ఉత్తమం.  సంబంధిత అప్లికేషన్లు కనెక్షన్లకి ఇచ్చే  సెక్యూరిటీ స్థాయి ఎలా ఉంది,  వాటిలో లభించే ఇతర ఆప్షన్స్‌ వంటివి కూడా పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలకు తగిన రిమోట్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌  చేసుకోండి.


 నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2021-01-09T06:31:38+05:30 IST