ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు

ABN , First Publish Date - 2022-06-29T06:21:10+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు.

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు
రాష్ట్ర స్థాయి 6వ ర్యాంకు సాధించిన పవిత్రకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

- సత్తా చాటిన గురుకుల కళాశాలల విద్యార్థులు

గద్వాల టౌన్‌, జూన్‌ 28 : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వృత్తివిద్య కోర్సుకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థిని కే. రేణుక, 500 మార్కులకు గాను 494 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకర్‌గా నిలిచింది.  రెండవ సంవత్సరం వృత్తివిద్య (ఎంఎల్‌టీ)లో హేమంత్‌ కుమార్‌, కే.రామచందర్‌లు 926/1000తో జిల్లా రెండవ స్థానంలో నిలిచారు.  వీరితో పాటు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జిల్లా టాపర్‌లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రతి భను చాటారని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధి కారి ఎం.హృదయరాజు తెలిపారు. ఎంపీసీ విభాగం లో 962/1000తో జి.తేజవర్ధన్‌ (ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అలంపూరు) ప్రథమ స్థానంలో నిలిచాడు.  కె.అనిత 953/1000 (ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అయిజ), విజయలక్ష్మి 945/1000 (ధరూరు) ద్వితీ య, తృతీయ స్థానాల్లో నిలిచారు.  బైపీసీ విభాగంలో కే. అశ్విని  943/1000 (అయిజ), ప్రథమ స్థానంలో నిలువగా,  కే. వెంకటేశ్వరి, 938/1000 (ఽఅలంపూరు), డి. రంజిత 929/1000 (ఽఅలంపూరు), ద్వితీయ, తృతీ య స్థానాలు దక్కించుకున్నారు. సీఈసీ విభాగంలో సుస్మిత  942/1000 (ధరూరు), ఈపి సురేంద్ర గౌడ్‌ 919/1000 (అయిజ), సంధ్య  895/1000 (ధరూరు) లు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. హెచ్‌ఈసీ విభాగంలో గంగాధర్‌ గౌడ్‌  851/1000 (అయిజ) ప్రథమ స్థానం సాధించగా, కే.మనోహర్‌  838/1000 (అయిజ), సి. రంగమ్మ 828/1000 (ధరూరు)లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 


ఇంటర్‌ ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణత

ధరూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో 170 మంది విద్యార్థులకు గాను 135 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ తెలిపారు. బైపీసీలో మునైజకు 432/440, జకియా 430, ఎంపీసీ ద్వితీయలో విజయలక్ష్మి 945/1000, సీఈసీ ద్వితీయలో సుశ్మిత 942 మార్కులు సాధించారు. ఎంపీసీలో అఖిల 470కి, 451 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ కృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.  


మెరిసిన కేజీబీవీ విద్యార్థులు

గద్వాల : ఇంటర్మీడియట్‌ ఫలితాలలో కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీదేవి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 30 మంది విద్యార్థులకు గాను 26 మంది, బైపీసీలో 39 మంది విద్యార్థులకు గాను 37 మంది ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు. ద్వితీయ సంవ త్సరం ఎంపీసీలో 31 మంది విద్యార్థులకు గాను 25 మంది, బైపీసీలో 38 మంది విధ్యార్థులకు గాను 35 మంది విధ్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 867 మార్కులు సా ధించి విద్యార్థిని రాజేశ్వరి కళాశాల టాపర్‌గా నిలిచిం దని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మన మధ్య లేదని ఆవేదన వ్వక్తం చేశారు. 


పుల్లూరు గురుకుల కళాశాలలో..

అలంపూర్‌ చౌరస్తా : మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ చాటారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తం 69 మంది పరీక్షలు రాయగా 65 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో 32మంది పరీక్షలు రాయగా 29 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 22 మంది విద్యార్థినులు 470కి గాను 400 మార్కులకు పైగా సాధించారు. కళాశాల టాపర్‌గా ఎ.ఇందు 463/470, కె.హేమలత 461/470, కె.రాజేశ్వరి 458/470 సాధించి ప్రశంసలం దుకున్నారు. బైపీసీలో 37 మంది పరీక్షలు రాయగా 36 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 26 మంది విద్యార్థినులు 440కి 400 మార్కులకు పైగా సాధించారు. బైపీసీ టాపర్లుగా టి.రేణుక 434/440, ఎం.కీర్తన 432/440, టి.గాయత్రి 431/440 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ దేవానందం తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఆయన అభినందించారు. హైస్కూల్‌ నుంచి కళాశాలగా అప్‌గ్రేడ్‌ పొందిన మొదటి ఏడాదిలోనే ఘన విజయాలు నమోదు చేసినట్లు తెలిపారు. 


ఇటిక్యాల గురుకుల కళాశాలలో..

ఇటిక్యాల : ఇటిక్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాల విద్యార్థు లు ఇంటర్‌ ఫలితాల్లో 90.47 శాతం ఉత్తీర్ణత సాధిం చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుపతయ్య తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ విభాగంలో 63 మందికి గాను 57 మంది ఉత్తీర్ణత సాధించారు. జూనియర్‌ విభాగంలో 81 మందికి గాను 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.


అలంపూర్‌ ప్రభుత్వ కళాశాలలో..

అలంపూరు : అలంపూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం లో తేజవర్ధన్‌ 962 సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. నిఖిత 921, మనీషా 815, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో కే. వెంకటేశ్వరి 936, డి.రజిత 929, సాయికౌశిక్‌ 924, సీఈసీ ద్వితీయ సంవత్సరంలో షేక్‌ ఆస్మా 799, మహేశ్వరి 746, సమ్రీన్‌ 715, ఎంపీసీ మొదటి సంవత్సరంలో కే. చరిత 457, జెస్సీ జోయల్‌ 448, విజయలక్ష్మి 432, బైపీపీ మొదటి సంవత్సరం ఏ. మౌనిక 422, డి. రిషిత 411, ఎం. జీవిత 410, సీఈసీ మొదటి సంవత్సరంలో చైతన్య 432, ఎస్‌.అలియాస్‌ 390, డి.మధు 354 విద్యార్థులు కళాశాల టాపర్‌లుగా నిలిచారని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హృదయరాజు తెలిపారు.  


జిల్లా టాపర్లుగా గట్టు విద్యార్థినులు

గట్టు : గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో  జిల్లా టాపర్లుగా నిలిచారని ప్రిన్సిపాల్‌ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఒకేషనల్‌ కోర్సులో ఎంపీహెచ్‌డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న మాచర్లకు చెందిన గాయత్రి 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. 487 మార్కులతో పీబీ ఉమ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. 485 మార్కులతో రజిత జిల్లాలో మూడవ స్థానం సాధించిందని తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 144 మందికి గాను 110 మంది ఉత్తీర్ణత (70శాతం) సాధించారన్నారు. రెండవ సంవత్సరం పరీక్ష రాసిన 130 మందికి గాను, 104 మంది ఉత్తీర్ణత (80శాతం) సాధించారన్నారు.  


చింతలకుంట విద్యార్థినుల ప్రతిభ

కేటీదొడ్డి : మండలంలోని చింతలకుంట గ్రామానికి చెందిన విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కన బరిచారు. గ్రామానికి చెందిన పవిత్ర ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు 431 సాధించి రాష్ట్ర స్థాయి ఆరవ ర్యాంకు సాధించింది. జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ కుమారై కీర్తి ఇంటర్‌లో 1000 మార్కులకు 953 మార్కులు సాధించింది. 


అయిజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో..

అయిజ : ఇంటర్‌ పరీక్షా ఫలితాలలో అయిజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచారు. ఎంపీసీలో అనిత 1,000కి 953, బీపీసీలో అశ్వని 943 మార్కులు, సీఈసీలో 919, హెచ్‌ఈసీలో గంగాధర్‌ 851 మార్కులు సాధించి ద్వీతీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్లు ఫ్రిన్స్‌పాల్‌ రాముడు తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో అంజలి 470కి 455 సాధించింది. బీపీసీలో తరుణి 430, సీఈసీలో అరవింద్‌ 471, హెచ్‌ఈసీ నందు గంగోత్రి 443 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 172 మంది హజరు కాగా, 138 (80.2 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సంలో 163 మంది పరీక్ష రాయగా 122 (66.6 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 


Updated Date - 2022-06-29T06:21:10+05:30 IST