బ్యాంకుల్లో కన్నా ఇందులో డబ్బులు పెడితే... మూడేళ్ళలో...

ABN , First Publish Date - 2020-09-18T23:51:47+05:30 IST

బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని భావిస్తున్నారా ? అయితే... ఓ విషయం... కుల్లో వడ్డీ రేట్లు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు... ఇప్పటికే... ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లలో కోత విధించాయి.

బ్యాంకుల్లో కన్నా ఇందులో డబ్బులు పెడితే... మూడేళ్ళలో...

ముంబై : బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని భావిస్తున్నారా ? అయితే... ఓ విషయం... కుల్లో వడ్డీ రేట్లు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు... ఇప్పటికే... ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లలో కోత విధించాయి.


ఈ క్రమంలో... డిపాజిట్ చేయాలని భావించే కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తే గతంలో కన్నా తక్కువ రాబడి వస్తుంది. మరేం చేయాలి ? దీనికో మార్గముంది. అది... కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ప్రముఖ కుక్కర్ల తయారీ కంపెనీ హాకిన్స్ కుక్కర్... ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులనందిస్తోంది.


వీటిల్లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. తొమ్మిది శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మూడేళ్ళ కాలానికి డిపాజిట్ చేస్తే... మంచి రాబడి ఉంటుందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు(సెప్టెంబరు 18, శుక్రవారం) నుంచీ... ఇందుకు సంబంధించిన  ఎఫ్‌డీ సేవలు అందుబాటులోకొచ్చాయి. సెప్టెంబర్ 30 తో ఎఫ్‌డీ సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది.  కనీసం రూ. 25 వేల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశమెుంటుంది. 


ఎఫ్‌డీ స్కీమ్స్‌లో రెండు రకాలు ఉంటాయి. స్కీమ్ ఏ, స్కీమ్ బీ. స్కీమ్‌ ఏ ఆప్షన్‌లో... వడ్డీ ప్రతి నెలా మీ ఎఫ్‌డీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. కాగా... స్కీమ్ బీ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ మొత్తాన్ని ఆరు నెలలకోమారు చెల్లిస్తారు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు కాల పరిమితులతో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏడాది ఎఫ్‌డీలపై 8.5 శాతం, రెండేళ్ల ఎఫ్‌డీలపై 8.75 శాతం, మూడేళ్ల ఎఫ్‌డీలపై 9 శాతం వడ్డీ వస్తుంది. ఈ కంపెనీకి ఇక్రా నుంచి స్టేబుల్ రేటింగ్ ఉంది. అంటే ఖాతాదారుల డబ్బుకు పెద్దగా రిస్క్ ఉండదని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఎఫ్‌డీల ద్వారా సంవత్సరానికి రూ. 5 వేలకు పైబడి వడ్డీ పొందితే...10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అయితే వీటిల్లో డబ్బు పెట్టేటప్పుడు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ దివాలా తీస్తే పెట్టిన డబ్బు మాత్రం వెనక్కు రాదు. 

Updated Date - 2020-09-18T23:51:47+05:30 IST