Advertisement
Advertisement
Abn logo
Advertisement

కలిజవేడు-కొట్రకోన మధ్య ఆరు నెలలుగా ఆగిన రాకపోకలు

గంగాధరనెల్లూరు, నవంబరు 30: నీవానది ప్రవాహం వల్ల గంగాధరనెల్లూరు మండలంలోని కలిజవేడు-కొట్రకోన పంచాయతీల మధ్య ఆరు నెలలుగా, ఆత్మకూరు-నరసింగరాయనిపేట పంచాయతీల మఽ ద్య రెండునెలలుగాపైగా ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో కలిజవేడు, నందనూరు, పాపిరెడ్డిపల్లె పంచాయతీలకు చెందిన ప్రజలు, విద్యార్థులు చిత్తూరుకు వెళ్ళాలంటే కలిజవేడు నుంచి నీవానదియేటి(నీళ్ళులేనప్పుడు)ప్రాంతం, కొట్రకోన పంచాయతీ మీదుగా చిత్తూరు నగరానికి చేరుకునేవారు. కలిజవేడు పంచాయతీవారు 10కిలోమీటర్లు, నందనూరు, పంచాయతీవారు 12కిలోమీటర్లు, పాపిరెడ్డిపల్లె పంచాయతీవారు 13కిలోమీటర్లు ప్రయాణించి కలిజవేడు, కొట్రకోన మీదుగా చిత్తూరు నగరానికి చేరుకుంటుండగా, వర్షాకాలంలో నీవానది ప్రవాహం వల్ల ఈ మూడు పంచాయతీ ప్రజలు గం గాధరనెల్లూరుకు వెళ్ళటంవల్ల సరాసరిగా 6 నుంచి 8 కిలోమీటర్లు దూరం పెరుగుతోంది. మండలంలో మరొకచోట ఆత్మకూరు, ఎల్లాపల్లె, కడపగుంట, ముక్కళత్తూరు, తిరువీధికుప్పం, మహాదేవమంగళం, అంబోధరపల్లె పంచాయతీలకు చెందిన ప్రజలు ఆత్మకూరు సమీపంలో నీవానదియేటి మీదుగా  చిత్తూరు మండలం నరసింగరాయనిపేటతో పాటు చిత్తూరు, తమిళనాడుకు వెళ్ళేవారు. అంతేగాక కొన్నిపంచాయతీలకు చెందినవారు హైస్కూలుతో పాటు బ్యాంక్‌, నిత్యావరాల కోసం దుకాణాలకోసం తప్పనిసరిగా నరసింగరాయనిపేట రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాల కారణంగా నీవానది ప్రవాహంతో ఈ పంచాయతీవాసులు నరసింగరాయనిపేటకు వెళ్ళాలంటే గంగాధరనెల్లూరుకు, అక్కడి నుంచి ఠాణాచెక్‌పో్‌స్టకు వెళ్లి చేరుకోవాల్సి వస్తోంది. పక్కనే ఉన్న ప్రాంతానికి వెళ్లి రావడానికి 40 నుంచి 45 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కలిజవేడు, ఆత్మకూరు ప్రాంతాల్లోని నీవానది యేటిప్రాంతంలో లోలెవల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారేగానీ అవి నెరవేర్చడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న 6 నెలలకే లోలెవల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని నారాయణస్వామి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన గెలి చి డిప్యూటీ సీఎం అయి రెండున్నర ఏళ్లు గడిచినా సమస్య పరిష్కారానికి చొరవచూపలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులు స్పందించి లోలెవల్‌బ్రిడ్జి నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement