బివేర్‌ ఫేక్‌ కొవిన్‌ యాప్స్‌

ABN , First Publish Date - 2021-05-22T09:09:24+05:30 IST

మంచి పక్కనే చెడు, సహాయం మాటున దోపిడి నిత్యకృత్యంగా మారింది. కొవిడ్‌ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్దేశించిన ‘కొవిన్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌’కు స్వల్ప మార్పులు చేస్తూ ఫేక్‌ యాప్‌ను కొంతమంది సృష్టిస్తున్నారు.

బివేర్‌ ఫేక్‌ కొవిన్‌ యాప్స్‌

మంచి పక్కనే చెడు, సహాయం మాటున దోపిడి నిత్యకృత్యంగా మారింది. కొవిడ్‌ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్దేశించిన ‘కొవిన్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌’కు స్వల్ప మార్పులు చేస్తూ ఫేక్‌ యాప్‌ను కొంతమంది సృష్టిస్తున్నారు. 


దీన్ని ప్రజల్లోకి పంపేందుకు ఎస్‌ఎంఎ్‌సలను ఉపయోగించుకుంటున్నారు. ఈ మెసేజ్‌ భాషలో కొద్దిపాటి మార్పు ఉన్నప్పటికి సారాంశం ఒక్కటిగానే ఉంటోంది. దీన్ని గుర్తించిన ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ-ఇన్‌) తాజాగా ఫేక్‌ కొవిన్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌లకు సంబంధించి హెచ్చరికను విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌కు స్లాట్‌లంటూ ఈ యాప్‌ల వైపు ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా మోసాలకు దిగుతున్నారని తెలియజేసింది. ఎస్‌ఎంఎ్‌సల ద్వారా యాప్‌ల వివరాలను తెలిపి, వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌కు ప్రోత్సహిస్తున్నారు. అయిదు ఏపీకే ఫైల్స్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫోన్లలోకి మాల్వేర్‌ పంపుతున్నారు. తద్వారా పర్సనల్‌ డేటాను తస్కరించడమే కాదు, తదుపరి మోసాలకు తెరలేపుతున్నారు.  ఆ అయిదూ ఫేక్‌ కొవిన్‌ యాప్‌లే...


*covid-19.apk

*vaci_Regis.apk

*MyVacin-v2.apk

*cov-Regis.apk

*vacin-Apply.apk


ఎస్‌ఎంఎ్‌సతో ఇచ్చే లింక్‌తో మాల్వేర్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి వస్తుంది. తద్వారా ఫోన్‌ వినియోగదారుడి కాంటాక్ట్‌ లిస్టు సహా పర్సనల్‌ డేటాపై దాడికి ఆస్కారం కల్పిస్తోంది. నిజానికి కొవిన్‌ యాప్‌ లేదంటే ఆరోగ్యసేతుతో  మాత్రమే వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం వీలుకల్పించింది. ఆ రెండూ కాకుండే మరేవీ రిజిస్ట్రేషన్‌ యాప్‌లు కావని  సీఈఆర్‌టీ-ఇన్‌ స్పష్టం చేసింది. పేటీఎం,  హెల్తీఫైమ్‌ వంటి మూడో పార్టీ వ్యాక్సిన్‌ ట్రాకర్లు కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తాయని తెలియజేసింది. 

Updated Date - 2021-05-22T09:09:24+05:30 IST