బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-01-07T08:25:23+05:30 IST

దేశంలోని రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ క్రమంగా విజృంభిస్తున్నందున..

బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త!

  • రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..
  • ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • వలస పక్షుల నుంచే ఫ్లూ
  • సైబీరియా, మంగోలియా, చైనా వంటి 
  • దేశాల నుంచి వచ్చిన వాటితో వ్యాప్తి
  • ఇప్పటికే 10 దేశాలకు బర్డ్‌ఫ్లూ వణుకు
  • వైరస్‌లో రెండు రకాల స్ట్రెయిన్స్‌
  • మనుషులకు సోకే ప్రమాదం తక్కువే!
  • కేరళలో 69,000 కోళ్లు, బాతుల వధ
  • బర్డ్‌ఫ్లూ ప్రబలిన రెండు జిల్లాల్లో చర్యలు
  • వధించిన పక్షులకు పరిహారం చెల్లింపు
  • కోడిమాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం
  • నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో
  • బర్డ్‌ఫ్లూ వైరస్‌ను నిర్ధారించిన కేంద్రం
  • గుంటూరులో బర్డ్‌ఫ్లూ జాడలు
  • గుదిబండివారిపాలెంలో 
  • 9 కాకులు, 6 పావురాలు మృతి


దేశంలోని రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ క్రమంగా విజృంభిస్తున్నందున.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బర్డ్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కలిగించి, బర్డ్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కలిగించి, బర్డ్‌ఫ్లూపై ప్రజలకు .


న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోని రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ క్రమంగా విజృంభిస్తున్నందున.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బర్డ్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కలిగించి, జాగ్రత్తలు తెలియజేయాలని కేంద్ర మత్య్స, పశుసంవర్ధకశాఖ సూచించింది. కేరళ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కూడా అప్రమత్తం కావాలని కేంద్రం పేర్కొంది. పక్షుల అసాధారణ మరణాలపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, బయో భద్రతా సూత్రాలు, వ్యక్తిగత పరిశుభ్రత, క్రిమి సంహారక చర్యలు తీసుకోవడంతోపాటు వంట, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం ద్వారా ఏఐ(ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా) వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చని కేంద్ర పశుపోషణశాఖ పేర్కొంది. 

Updated Date - 2021-01-07T08:25:23+05:30 IST