ట్రాఫిక్ చ‌లాన్ చెల్లింపు పేరుతో రూ.60,000 మోసం.. ఆ కేటుగాళ్లు ఇదంతా ఎలా చేశారంటే..

ABN , First Publish Date - 2021-12-09T05:45:56+05:30 IST

ఒక వ్యక్తి నిజాయితీగా రూ.400ల ట్రాఫిక్ చ‌లాన్ చెల్లించ‌బోయి ఏకంగా రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఈ సంఘ‌ట‌న ముంబై మహానగరంలో జరిగింది...

ట్రాఫిక్ చ‌లాన్ చెల్లింపు పేరుతో రూ.60,000 మోసం.. ఆ కేటుగాళ్లు ఇదంతా ఎలా చేశారంటే..

ఒక వ్యక్తి నిజాయితీగా రూ.400ల ట్రాఫిక్ చ‌లాన్ చెల్లించ‌బోయి ఏకంగా రూ. 60,000 పోగొట్టుకున్నాడు. ఈ సంఘ‌ట‌న ముంబై మహానగరంలో జరిగింది.

ముంబైకి చెందిన వ‌కాసే అనే ఒక బ‌స్ డ్రైవ‌ర్ త‌ను న‌డిపే ఫోర్ వీల‌ర్‌పై ఉన్న ట్రాఫిక్ చ‌లానాని అన్‌లైన్‌లో క‌ట్టాడు. కానీ చ‌లానా చెల్లింపు జ‌రిగిన‌ట్లు త‌న ఫోన్‌కి మెసేజ్ రాక‌పోవ‌డంతో వ‌కాసే ఆ వెబ్‌సైట్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్‌కు కాల్ చేశాడు. అవ‌త‌ల ఫోన్ ఎత్తిన వ్య‌క్తి వ‌కాసేకు క‌లిగిన ఇబ్బంది విని.. అత‌ను చేసిన చెల్లింపు గురించి వివ‌రాలు అడిగాడు. ఈ క్ర‌మంలో వ‌కాసే నుంచి అత‌ని డెబిట్ కార్టు నెంబ‌ర్, ఫోన్‌లో వ‌చ్చిన ఒటిపిని కూడా చెప్ప‌మ‌న్నాడు. 

వ‌కాసే ఆ వ్య‌క్తి చెప్పిన‌ట్లు చేశాడు. కాసేపు త‌రువాత వ‌కాసే అకౌంట్ నుంచి రూ.60,000 డెబిట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. దీంతో ఆందోళ‌న చెందిన వ‌కాసే మ‌ళ్లీ అదే క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్‌కు కాల్ చేశాడు. కానీ ఈ సారి ఎవ‌రూ కాల్ రిసీవ్ చేయ‌లేదు. ఏం చేయాలో తెలియ‌క వ‌కాసే పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా.. వారు వ‌కాసే చెల్లించిన చల‌ాన్ వెబ్‌సైట్ న‌కిలీద‌ని చెప్పి కేసుని సైబ‌ర్ క్రైం విభాగానికి అప్పగించారు.




ఇలాంటి అన్‌లైన్ చెల్లింపులు చేసే స‌మ‌యంలో బ్యాంకు లేదా చెల్లింపు తీసుకునే ఏ ఇత‌ర సంస్థ కూడా డెబిట్ కార్డు, పాస్‌వ‌ర్డ్, ఒటిపి వంటి వివ‌రాలు అడ‌గ‌ర‌ని.. ఒక‌వేళ ఎవ‌రైనా అడిగినా చెప్ప‌కూడ‌ద‌ని బ్యాంకు అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఏదైనా కొ్త్త నెంబరు నుంచి వచ్చిన మెసేజ్‌లలో వచ్చే యాప్ లింక్స్ ఉంటే వాటిని కూడా డౌన్ లౌడ్ చేయకూడదని అంటున్నారు.


Updated Date - 2021-12-09T05:45:56+05:30 IST