Abn logo
Jul 21 2021 @ 07:45AM

భద్రాద్రి కొత్తగూడెంలో వర్షం..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.