Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రాణాలకు తెగించి గిరిజనులకు సేవలందిస్తున్న డాక్టర్ సంధ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఏజెన్సీలో వైద్యం అందించడం కోసం డాక్టర్ సంధ్య తన బృందంతో కొన్ని కి.మీ. నడుచుకుంటూ వెళ్లి అక్కడ గిరిజనులకు వైద్యం అందించారు. ఈ సీజన్‌లో ఏజెన్సీలో వైద్యం అందక చాలా మంది గిరిజనులు చనిపోతుంటారు. వాళ్లకు మందు బిల్లలు కావాలన్నా నదులు, వాగులు దాటి రావాల్సి ఉంటుంది. అటువంటి ప్రాంతానికి డాక్టర్ సంధ్య వాగుదాటి వెళ్లి బాధితులకు వైద్యం అందించారు.


ఆల్లపల్లి మండలంలో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ సంధ్య విధులు నిర్వహిస్తున్నారు. రాయిగూడెం వెళ్లాలంటే కిన్నెరసాని వాగు దాటాల్సిందే. అటువంటి ప్రాంతానికి ఆమె వెళ్లి బాధితులకు వైద్యం అందిస్తూ.. సీజనల్ వ్యాధుల పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన అనుభవాలను వెల్లడించారు. ఈ వీడియోక్లిక్ చేయండి...


Advertisement
Advertisement