‘నవమి’ వేదిక ఎక్కడ ? మిథిలా స్టేడియమా.. నిత్యకల్యాణ మండపమా

ABN , First Publish Date - 2021-02-22T05:33:41+05:30 IST

‘నవమి’ వేదిక ఎక్కడ ? మిథిలా స్టేడియమా.. నిత్యకల్యాణ మండపమా

‘నవమి’ వేదిక ఎక్కడ ? మిథిలా స్టేడియమా.. నిత్యకల్యాణ మండపమా
గత ఏడాది నిర్వహించిన కల్యాణం

స్పష్టత కోసం దేవస్థానం అధికారుల ఎదురుచూపు

భద్రాద్రి శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు కలెక్టర్‌ సమీక్ష

భద్రాచలం, ఫిబ్రవరి 21: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామికి శ్రీరామనవమి రోజు నిర్వహించే కల్యాణ ఉత్సవాన్ని ఈసారి మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారా లేక నిత్య కల్యాణ వేదికలో నిర్వహిస్తారా ? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 13నుంచి 27వరకు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మో త్సవాలు నిర్వహించనున్నారు. 15 రోజులపాటు జరిగే ఉత్స వాల్లో ఏప్రిల్‌ 21న శ్రీరామనవమి రోజు స్వామి వారి కల్యా ణం, 22న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణపై స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు దేవస్థానం అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. అయితే ఇంత వరకు ఎటువంటి అధి కారిక స్పష్టత రాలేదని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా స్వామివారి కల్యాణం, మహా పట్టాభిషేకాలను ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ వేదిక వద్దే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. గత కొన్నేళ్లుగా పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చే సంప్రదాయాన్ని పాటిం చకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారైనా శ్రీరామనవమికి సీఎం కేసీఆర్‌ దంపతులు వస్తారా లేదా అనే దానిపై సైతం స్పష్టత రావాల్సి ఉంది. 

సర్వత్రా ఉత్కంఠ

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ప్రధా నంగా తెలంగాణకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌లతోపాటు కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అధికంగా ఈ ప్రభావం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతు న్నాయి. ప్రజలు జాగ్రత్తల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలతో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో భద్రాద్రిలో నవమి కల్యాణం ఎలా నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా మళ్లీ ప్రభలుతున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ నూతన మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయని వైద్యశాఖ అధికారులు పేర్కొం టున్నారు. ఈ క్రమంలో స్వామివారి కల్యాణం మిథిలా స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

నేడు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సమీక్ష 

శ్రీరామనవమి ఏర్పాట్లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష నిర్వహించనునున్నారు. ఈ సమీక్ష సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన నివేదికలను సైతం వారు సిద్ధం చేసుకుంటున్నారు.

Updated Date - 2021-02-22T05:33:41+05:30 IST