Jul 29 2021 @ 14:35PM

భగత్‌సింగ్‌ రచన ఆధారంగా..

ఇటీవల ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ‘భగత్‌సింగ్‌ నగర్‌’ టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన ప్రకాశ్‌రాజ్‌ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ప్రదర్శించిన ఏవీలో ఆయన అనుమతి లేకుండా ‘మా అసోసియేషన్‌’కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్‌ను ప్రదర్శించినందుకు దర్శకుడిపై ఫైర్‌ అయ్యారు. విదార్థ్‌, ధృవిక జంటగ వాలాజ క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేశ్‌ ఉడత్తు నిర్మిస్తున్న ‘భగత్‌సింగ్‌ నగర్‌’ టీజర్‌ను బుధవారం ప్రకాశ్‌ రాజ్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘నాకు భగత్‌సింగ్‌, ఆయన పోరాట పటిమ అంటే చాలా ఇష్టం. ఈ దేశం భగతసింగ్‌ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని. దర్శకుడు మంచి కథ తీసుకున్నాడు’’ అని అన్నారు. ‘‘భగత్‌సింగ్‌గారు రాసిన ఓ లైన్‌ ఆధారంగా సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో కమర్షియల్‌ హంగులు జోడించి తీసిన అందమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు చెప్పారు.