చదరపు సెంటీమీటర్‌ సైజ్‌లో భగవద్గీత

ABN , First Publish Date - 2021-10-26T05:52:35+05:30 IST

మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు కోసం కోరుకొండ దోసకాయలపల్లికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి అడ్డాల బాలశివజేత శ్రమి స్తున్నాడు.

చదరపు సెంటీమీటర్‌ సైజ్‌లో భగవద్గీత

కోరుకొండ, అక్టోబరు 25: మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు కోసం   కోరుకొండ దోసకాయలపల్లికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి అడ్డాల బాలశివజేత శ్రమి స్తున్నాడు.   రాజమహేంద్ర వరంలో ఇంట ర్మీడియట్‌ చదువుతున్న అడ్డాల బాలశివతేజ కొన్నేళ్లుగా అతి చిన్న చేతిరాతలో సాధన చేస్తున్నాడు. ఎలాగైనా తాను మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు సాధించాలన్న పట్టుదలతో చదరపు సెంటీమీటర్‌ పరిమాణం గల 240 పేజీల పుస్తకంలో భగవద్గీతలోని 240 శ్లోకాలు. 50 చిత్రాలను చేతితో రాసి ఔరా అనిపించాడు. ఇందుకు గాను ఆ విద్యార్థి తీసుకున్న సమయం కేవలం 2 గంటల 50 నిముషాల 23 సెకన్లు మాత్రమే. ఈ అరుదైన భగవద్గీత పుస్తకాన్ని చేతితో రాసి మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు కోసం ఒంగోలుకు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను కొందరి జడ్జిల సమక్షంలో రూపొందించినట్లు ఆ విద్యార్థి తెలిపాడు. ఈ సందర్భంగా అతడిని దోసకాయలపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయులు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2021-10-26T05:52:35+05:30 IST