తాపత్రయాన్ని వదలాలి!

ABN , First Publish Date - 2021-02-26T05:44:08+05:30 IST

అన్ని పనులు చేస్తూ కూడా నిశ్చింతగా ఎలా ఉండవచ్చో భగవద్గీత ఐదో అధ్యాయం పదమూడో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు.

తాపత్రయాన్ని వదలాలి!

అన్ని పనులు చేస్తూ కూడా నిశ్చింతగా ఎలా ఉండవచ్చో భగవద్గీత ఐదో అధ్యాయం పదమూడో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు.


సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ

నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్‌ న కారయన్‌


బంధనాల్లో ఇరుక్కోకుండా ఎలా ఉండాలో ఆయన చేసి చూపించాడు. పదహారు వేల పెళ్లిళ్లు చేసుకున్నా బంధనాల్లో ఇరుక్కోలేదు. పద్దెనిమిది రోజుల యుద్ధానికి సారథ్యం వహించినా బంధనాల్లో ఇరుక్కోలేదు. ‘సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే...’ అన్ని పనులను అంటే వాటి తాలూకు తాపత్రయాన్ని మనసులో విడిచిపెట్టాలి. ఆందోళనను విడిచిపెట్టాలి. ‘సుఖం వశీ...’ ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు. ‘నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్‌ న కారయన్‌..’ నవద్వారాలు కలిగిన ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఏ పనీ చేసిన వాడు కాదు, చేయించిన వాడు కూడా కాదు. క్లిష్టపరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలో అతను ఆచరించి చూపించాడు... యుద్ధరంగంలో నిలబడి భగవద్గీతను బోధించిన ఆ శ్రీకృష్ణపరమాత్మ.


గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-02-26T05:44:08+05:30 IST