భక్తులకు అందుబాటులోకి భాగవతం

ABN , First Publish Date - 2021-09-29T06:25:10+05:30 IST

టీటీడీ ఏడో ముద్రణ పోతన భాగవతం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆరో ముద్రణను రూ.1175కు అందించగా, ప్రస్తుత ముద్రణకు ధరను రూ.2700గా నిర్ణయించిది.

భక్తులకు అందుబాటులోకి భాగవతం

భారీగా ధర పెంచిన టీటీడీ


తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఏడో ముద్రణ పోతన భాగవతం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆరో ముద్రణను రూ.1175కు అందించగా, ప్రస్తుత ముద్రణకు ధరను రూ.2700గా నిర్ణయించిది. 1987లో మొదటిసారి టీటీడీ పోతన తెలుగు పద్య భాగవతాన్ని వ్యవహారిక భాషలోకి అనువదించి ముద్రించింది.  5 సార్లు పునర్ముద్రణ అయింది. 2015లో అనువాద భాషను కొంత సంస్కరించి పునర్ముద్రించింది. అవి అమ్ముడయి చాలా కాలం అయింది. ఇప్పుడు ఏడోసారి తిరిగి ముద్రణతో అందుబాటులోకి వచ్చింది. 12 స్కంధాలు, ఎనిమిది సంపుటాలు, 5696 పేజీలున్న ఈ భాగవతాన్ని 32 మంది పండితులు తెలుగు చేసినట్టు టీటీడీ తెలిపింది. పోస్టల్‌ ద్వారా కూడా పంపుతామని, టీటీడీ ఈవో పేరిట జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌ జత చేసి ప్రత్యేకాధికారి, ముద్రణవిభాగం, ప్రెస్‌కాంపౌండ్‌, కె.టి.రోడ్డు, తిరుపతికి పంపాలని టీటీడీ కోరింది.

Updated Date - 2021-09-29T06:25:10+05:30 IST