భగీరథుడే దిగిరావాలేమో

ABN , First Publish Date - 2021-06-19T04:47:10+05:30 IST

ప్రతీ గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు అందిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు కేవలం ప్రచారానికి మాత్రమే మరిమితమవుతున్నాయి. అసలు గ్రామాల్లో పూర్తి స్థాయిలో నీరు అందుతుందా లేదా అనేది కూడా అధికారులు పర్యవేక్షణ చేయలేక పోతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల్లోని పేదలకు సచ్ఛమైన తాగునీరు అదడం లేదు. చేసేదేమీలేక గొంతు తడుపుకునేందుకు మోటారు నీటిని తాగుతున్నారు. ఇదే క్రమంలో అనారోగ్యం బారిన పడుతున్నారు.

భగీరథుడే దిగిరావాలేమో
గన్నవరం కాలనీ

గన్నవరం వాసులకు అందని  భగీరథ నీరు

నిరుపయోగంగా ట్యాంకు

నీరు పైకి ఎక్కకపోవడమే కారణం

పట్టించుకోని అధికారులు

బోరు నీరు తాగి గ్రామస్థులకు అనారోగ్యం

చర్ల, జూన్‌ 18: ప్రతీ గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు అందిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు కేవలం ప్రచారానికి మాత్రమే మరిమితమవుతున్నాయి. అసలు గ్రామాల్లో పూర్తి స్థాయిలో నీరు అందుతుందా లేదా అనేది కూడా అధికారులు పర్యవేక్షణ చేయలేక పోతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల్లోని పేదలకు సచ్ఛమైన తాగునీరు అదడం లేదు. చేసేదేమీలేక గొంతు తడుపుకునేందుకు మోటారు నీటిని తాగుతున్నారు. ఇదే క్రమంలో అనారోగ్యం బారిన పడుతున్నారు.

నీటి మొహం చూడని గిరిజనులు

చర్ల మండలం గన్నవరం కాలనీలో సుమారు 150 కుటుంబాలు ఉంటున్నాయి, వీరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గ్రామానికి మిషన్‌ భగీరథ పైపులైన్‌, ట్యాకు నిర్మించారు. ప్రతీ ఇంటికి నల్లాలు ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు ట్యాంకులోకి మిషన్‌ భగీరథ నీటిని ఎక్కించలేదని స్థానికులు చెబుతున్నారు. అడిగితే నీటి ఒత్తిడి సరిపోవడం లేదని చెబుతున్నారని వాపోతున్నారు. ట్యాంకు నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చుక్కనీటిని చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. మండల కేంద్రానికి దగ్గర ఉన్న గ్రామానికే నీరు అందించక పోతే, ఇక అటవీ గ్రామాల వారికి నీటిని ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. 

బోరు నీరే దిక్కు

గన్నవరం కాలనీకి మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో స్థానిక పంచాయితీ సిబ్బంది బోరు నీటిని అందిస్తున్నారు. కాగా ఇదే నీటిని తాగుతున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడుతురన్నారు. కాగా ట్యాంకుని నిర్మించి అధికారులు దాన్ని అలంకార ప్రాయంగా ఉంచారని స్థానికులు మండిపడుతున్నారు. నీటిని సరఫరా చేయనప్పుడు నల్లాలు ఎందుకని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు రావడం లేదని చెప్పుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తు న్నారు.

నీరు ఎక్కడం లేదు: ఏసుబాబు, మిషన్‌ భగీరథ, డీఈ 

గ్రామానికి నీటిని సరఫరా కాని మాట వాస్తవమే. ఒత్తిడి సరిపోక ట్యాంకుకి నీరు ఎక్కడం లేదు. త్వరలో బూస్టర్‌ పంపు ఏర్పాటు చేస్తాం. గ్రామానికి మిషన్‌ భగీరధ నీటిని అందిస్తాం. పనులు అతి త్వరలో పూర్తి చేస్తాం.

Updated Date - 2021-06-19T04:47:10+05:30 IST