భగ్గుమన్న తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-10-20T05:00:15+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ శ్రేణులు, విలేకరులపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు జిల్లాలో ధర్నాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నియంతృత్వ పాలనే ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సాలూరులో జాతీయ రహదారిపై బోసుబొమ్మ కూడలి వద్ద మంగళవారం రాత్రి తీవ్ర నిరసన తెలిపాయి.

భగ్గుమన్న తమ్ముళ్లు
సాలూరు: జాతీయ రహదారిపై నిరసన తెలియజేస్తున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ కార్యాలయంపై దాడులకు నిరసన

సాలూరులో శ్రేణుల ధర్నా

సాలూరు, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ శ్రేణులు, విలేకరులపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు జిల్లాలో ధర్నాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నియంతృత్వ పాలనే ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సాలూరులో జాతీయ రహదారిపై  బోసుబొమ్మ కూడలి వద్ద మంగళవారం రాత్రి తీవ్ర నిరసన తెలిపాయి. టీడీపీ అరకు పార్లమెంటరీ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ.భంజ్‌దేవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. గతంలో ఎన్నడూ ఇంత దుర్మార్గమైన పాలన చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంభించి ఉంటే 18 నెలల పాటు జైల్లో ఉన్న మీరు పాదయాత్ర చేసేవారా...? అని సీఎం జగనను ప్రశ్నించారు. విలేకరులపైనా దాడులు చేయటం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పిన్నింటి ప్రసాద్‌బాబు, కొల్లి మోహన్‌, అబ్ధుల్‌, బొత్స తిరుపతి, డబ్బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-20T05:00:15+05:30 IST