రేపటి నుంచి Bhagyalakshmi ఆలయంలో దీపావళి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-11-01T13:08:00+05:30 IST

చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్‌ 2 నుంచి ఐదురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు...

రేపటి నుంచి Bhagyalakshmi ఆలయంలో దీపావళి ఉత్సవాలు

హైదరాబాద్/చార్మినార్‌: చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని  నవంబర్‌ 2 నుంచి ఐదురోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు. ఉత్సవాలకు గవర్నర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు వివిధ పార్టీల ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా 2న ధన్‌ తేరస్‌ పూజ నిర్వహించనున్నారు. 3న చోటా దీపావళి, 4న శుభ దీపావళి నిర్వహించనున్నారు. దీపావళి పండుగకు అమ్మవారు మోహిని రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని శశికళ తెలిపారు. దీపావళి పూజలు ఈ నెల 6 వరకు కొనసాగుతాయన్నారు. నవంబర్‌ 6న గురుద్వారా సిక్కు సోదరులు నిర్వహించే ప్రకాష్‌ ర్యాలీకి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు.

Updated Date - 2021-11-01T13:08:00+05:30 IST