భక్తులను కానుకలిమ్మంటూ భజంత్రీల ఒత్తిడి

ABN , First Publish Date - 2021-08-05T06:16:04+05:30 IST

కానుకలు ఇవ్వమంటూ ముక్కంటి ఆలయ భజంత్రీల తీరుతో స్వామి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

భక్తులను కానుకలిమ్మంటూ భజంత్రీల ఒత్తిడి

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 4: కొందరు భజంత్రీల తీరుతో ముక్కంటి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామి సేవలు, నైవేద్యం, హారతి ఇచ్చే సమయంలోను, ప్రముఖులకు స్వాగతం పలకడం తదితర విధులను శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేస్తున్న భజంత్రీలు నిర్వహిస్తుంటారు. అడపాదడపా వీరికి విరామ వేళలు ఉండడంతో, పలువురు స్వామి దర్శనార్థం వెళ్లే భక్తుల క్యూలైన్ల వద్దకు చేరుతున్నారు. వాయులింగేశ్వరుడి దర్శనం ముగించుకుని వెలుపలకు వచ్చే భక్తులను కానుకలిమ్మంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులు మందలించినా కొందరి తీరులో మార్పురావడం లేదు. దీంతో తమలో పలువురు భక్తులను కానుకలు అర్థించడం సిగ్గుచేటుగా ఉందని సహచర భజంత్రీలు వాపోతున్నారు.

Updated Date - 2021-08-05T06:16:04+05:30 IST