Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్ష యూటర్న్.. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి

కొలంబో: శ్రీలంక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ భానుక రాజపక్ష  తన రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు పది రోజుల క్రితం ప్రకటించిన 30 ఏళ్ల రాజపక్స ఇప్పుడు యూటర్న్ తీసుకుని అన్ని ఫార్మాట్లలోనూ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భానుక శ్రీలంక తరపున 5 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.


వ్యక్తిగత కారణాలతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ఈ నెల 3న రాజపక్స ప్రకటించాడు. అయితే, శ్రీలంక క్రీడామంత్రి నమల్ రాజపక్స‌తో సమావేశం అనంతరం భానుక తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శ్రీలంక క్రికెట్ తెలిపింది.   

Advertisement
Advertisement