Abn logo
Sep 27 2021 @ 14:33PM

AP: మోదీ ప్రభుత్వం దేశద్రోహ చర్యలకు పాల్పడుతోంది: సీపీఎం

విశాఖ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగుతోంది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. విశాఖలోని మద్దిలపాలెం సెంటర్ వద్ద వామపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. నల్ల చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నరేంద్రమోదీ తీసుకువచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాయని, రైతాంగ జీవితాలను నాశనం చేస్తాయన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ఫ్లాంట్, పోర్టులు, బ్యాంకులు, రైల్వే, విద్యుత్, ఆయిల్ రంగాలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. దేశ సంపదను విదేశీ, స్వదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాళ్లిచ్చే కాసులకు కక్కుర్తిపడి మోదీ ప్రభుత్వం దేశద్రోహ చర్యలకు పాల్పడుతోందని సీపీఎం నేతలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. కరోనా కంటే తీవ్రమైన ప్రమాదకారి బీజేపీ అని, దేశానికి పట్టిన బీజేపీ కరోనాని పారద్రోలాలని నేతలు పిలుపు ఇచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption