Abn logo
Sep 26 2021 @ 00:43AM

భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి

కదిరిఅర్బన్‌, సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ  సోమవారం చేపట్టనున్న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక పొట్టిశ్రీరాములు వి గ్రహం వద్ద బంద్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లు వెం టనే రద్దు చేయాలన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకు రావాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఆదాయ పన్నేతర కుటుంబాలకు నెలకు రూ. 7500 చొప్పున ఆరు నెలలు పాటు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీ కరణ, మానిటైజేషన్‌ ఆపాలని, పెరిగిన పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర  ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బడా సుబ్బిరెడ్డి, జీఎల్‌ నరసింహులు, భాస్కర్‌, శారద, సీఐటీయూ నాయకులు హరినాథ్‌, ముస్తాక్‌, ఫైరోజ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.