Abn logo
Sep 28 2021 @ 00:51AM

భారత్‌ బంద్‌ విజయవంతం

ఖాళీ తట్టతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు

హోరెత్తిన నినాదాలు

ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహం 

నల్లచట్టాలు, లేబర్‌ కోడ్‌ ఉపసంహరించాలని డిమాండ్‌

సోమవారం భారత్‌ బంద్‌ విజయవంతమైంది. దుకాణాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.   పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్రం విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నల్ల చట్టాలు రద్దు చేయాలని,  ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలన్న నినాదాలతో హోరెత్తించారు.

నరసాపురం టౌన్‌, సెప్టెంబరు 27: కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై సోమవారం అఖిలపక్షాలు చేపట్టిన బంద్‌ నరసాపురంలో విజయవంతమైంది.  అఖిలపక్ష నాయకులు షాపుల్ని తెరవని వ్వలేదు. బస్సుల్ని డిపో నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మాను ష్యంగా కనిపించా యి. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీడీపీ, జన సేన ఆధ్వర్వంలో ర్యాలీలు చేశారు. వామపక్షాల నాయకులు నెక్కంటి సుబ్బా రావు, కవురు పెద్దిరాజు, టి సత్యనారాయణ, ఎం త్రిమూర్తులు, నెక్కంటి క్రాంతికుమార్‌, ఆరేటి మృత్యంజయ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో  వేర్వేరుగా ఆందోళ నలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  కేంద్ర విధానా లను నిరసిస్తూ ఖాళీతట్టతో వామపక్షాలతో కలిసి ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు కొట్టు పండు, చిటికెల రామ్మోహన్‌, బళ్ళ మూర్తి, రెడ్డిం శ్రీను, అంబటి ప్రకాష్‌, కుక్కల రవి, దానియేలు, సర్పంచ్‌ ఈదా సురేష్‌బాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సెంటర్‌లో టీడీపీ నాయకులు వామపక్షాలతో కలసి నిరసన తెలిపారు.  పసుపులేటి రత్నమాల, కొప్పాడ రవి, అకన సుబ్ర మణ్యం, అధికారి ఆనంత రామారావు, పాలూరి బాబ్జీ, మౌలాలీ, పి నాగబాబు, భూపతి నరేష్‌, మల్లాడి మూర్తి, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 

మొగల్తూరు: సోమవారం టీడీపీ, వామపక్షాలు చేపట్టిన  బంద్‌ విజయవంతమైంది. ఆయా పార్టీల  శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు.  గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, యడ్ల చిట్టిబాబు, ఆదూ రి సాంబమూర్తి, వీరా పాండురంగారావు, కొత్త విజయ్‌ కుమార్‌, చిలకలపూడి నాగేశ్వరరావు, అడ్డాల ఏడుకొండలు, కొత్తపల్లి నాగరాజు, చల్లా వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌/యలమంచిలి: భారత్‌ బంద్‌ సోమవారం పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను వివిధ పార్టీల కార్యకర్తలు మూయించి వేశారు.  ఆర్టీసీ బస్సులు సాయంత్రం 4 గంటల వరకూ నడవలేదు.  స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, యుటిఎఫ్‌, ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్ధేశించి ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ  ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే రానున్నకాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి మండలంలో  సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ, కార్మిక, రైతు సంఘాల  నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి తహసీల్దారు కార్యాలయం వద్ద, చించినాడలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.  బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్‌, ఇంజేటి శ్రీను, ఎం.సత్యనారాయణ, బి.సుగుణ, జిల్లెళ్ల ప్రశాంతి, చివటపు రాజు, శీలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం అర్బన్‌/రూరల్‌/క్రైం: కేంద్రం రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను  ఉపసంహరించుకోవాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్‌ చేశారు. పట్టణంలో సోమవారం భారత్‌ బంద్‌ను టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ర్యాలీగా ప్రకాశం చౌక్‌ సెంటర్‌కు చేరుకున్నారు.  సీపీఐ నాయకుడు చెల్లబోయిన రంగారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వేండ్ర శ్రీనివాస్‌,  ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నాయకులు లంకా కృష్ణమూర్తి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ రంగసాయి, దళిత నాయకుడు గంటా సుందర్‌కుమార్‌, సీపీఎం, సీపీఐ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.  రైతులకు  మద్దతు ధర కల్పించాలని,  విద్యుత్‌ సవరణ బిల్లు,   లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీపీఎం మండల  కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.   సోమవారం వెంపలో  వర్తక, వాణిజ్య సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.  జనసేన నాయకుడు పట్టం శ్యాం బాబు తదితరులు పాల్గొన్నారు.  భీమ వరంలో  బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.  ముందుగానే బంద్‌ను ప్రకటిం చడంతో ప్రయాణికులు, ప్రజలు బయటకు రాలేదు.   

వీరవాసరం: మండలంలో సీపీఎం, టీడీపీ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో  నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు వి.చంద్రశేఖర్‌, కొల్లేపర శ్రీనివాసరావు,  వి. శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు బాలం విజయకుమార్‌, కొత్తల సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు. 

ఉండి: ఉండిలో వామపక్షాల బంద్‌కు వైసీపీ మద్దతు ఇచ్చింది. ర్యాలీ నిర్వహించారు. సీపీయం డెల్టా కార్యదర్సి జేఎన్‌వీ గోపాలన్‌, సీపీఐ ఉండి ఏరియా కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు, సీపీఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌, ఎంసీపీఐ నాయకుడు గురుగుబిల్లి రాంబాబు  మాట్లాడుతూ  ఉక్కు ప్రైవేటీకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మండల కన్వీనరు గులిపల్లి అచ్చారావు, ఎంపీపీ హరిబాబు, మండల సర్పంచ్‌లు చాంబర్‌ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: రైతు వ్యతిరేక నల్ల చట్టాలను బీజేపీ మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకొకపోతే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని సీపీఎం మండల కార్యదర్శి కె.తవిటినాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు హెచ్చరించారు.  వర్షంలో తడుస్తూ బ్యాంకులను మూయించి వేశారు.   వామపక్షాల నేతలు పెంకి అప్పారావు, షేక్‌ వలీ, తోట రామకృష్ణ,  టీడీపీ నేతలు గంధం ఉమా, అజయ్‌గౌడ్‌ , సుబ్బారావు  తదితరులు ఉన్నారు.

పెనుమంట్ర: మండలంలో  బంద్‌ విజయవంతమైంది. మార్టేరు సెంటర్‌ల కార్మికులు, అనుబంధ సంస్ధలు మానవహారం నిర్మించాయి. సంఘ నాయకులు భవానీ, భాగ్యలక్ష్మి, జ్యోతి, సత్తిబాబు, శివయ్య, సుధాకర్‌  పాల్గొన్నారు.

పాలకోడేరు: కేంద్రంలో మోదీ ప్రభుత్వం విదానాలు వల్ల దేశం అభివృద్ది 50 ఏళ్ళు వె నక్కి వెళ్ళిపోయిందని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కె క్రాంతి బాబు అన్నారు. కిసాన్‌ మోర్చ సంయుక్త మోర్చ ఇచ్చిన పిలుపు మేరకు భారత్‌ బంద్‌లో భాగంగా ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలోడెల్టాపేపర్‌ మిల్స్‌ దగ్గరనుంచి పాలకోడేరు రావిచెట్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  

ఆచంట:  భారత్‌ బంద్‌  ఆచంటలో విజయవంతం అయ్యింది. వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు  నిరసన తెలిపారు.  కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు,  జడ్పీటీసీ సురేష్‌బాబు, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, నెక్కంటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనుగొండ:  మండలంలో బంద్‌ విజయవంతమైంది. పెనుగొండ గాంఽధీ బొమ్మల సెంటర్‌లో మండల సీఐటీయు కార్యదర్శి ఎస్‌. వెంకటేశ్వరరావు మాట్లా డుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

పోడూరు:  పోడూరు మండలంలో బంద్‌ విజయవంతమైంది. సీఐటీయూ మండల కార్యదర్శి  వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రం  ఇప్పటికైనా రైతుల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

సిద్దాపురం(ఆకివీడు రూరల్‌): భారత్‌ బంద్‌ గ్రామాల్లో ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో  పాఠశాలలు, బ్యాంకులు మూయించి వేశారు. రైతుల కోసం ప్రభుత్వాలు పని చేయాలన్నారు.  విశాఖ ఉక్కును ప్రైవేటీ కరిస్తే సహించేది లేదన్నారు. భూపతిరాజు తిమ్మరాజు, మద్దా యోహాను, పసల సుందరరావు తదితరులు పాల్గొన్నారు.