అగ్ర‌రాజ్యం అమెరికాలో 'కొవాక్జిన్' అత్య‌వ‌స‌ర వినియోగానికి ద‌ర‌ఖాస్తు

ABN , First Publish Date - 2021-05-25T20:29:46+05:30 IST

భారత్‌ బయోటెక్ రూపొందించిన‌ దేశీయ వ్యాక్సిన్‌ 'కొవాక్జిన్‌'ను అగ్ర‌రాజ్యం అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆ దేశంలోని భాగస్వామ్య సంస్థ ఓక్యూజెన్.. ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎఫ్​డీఏ)కు దరఖాస్తు చేసింది.

అగ్ర‌రాజ్యం అమెరికాలో 'కొవాక్జిన్' అత్య‌వ‌స‌ర వినియోగానికి ద‌ర‌ఖాస్తు

వాషింగ్ట‌న్‌: భారత్‌ బయోటెక్ రూపొందించిన‌ దేశీయ వ్యాక్సిన్‌ 'కొవాక్జిన్‌'ను అగ్ర‌రాజ్యం అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆ దేశంలోని భాగస్వామ్య సంస్థ ఓక్యూజెన్.. ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎఫ్​డీఏ)కు దరఖాస్తు చేసింది. కొవాక్జిన్ కోసం ఎఫ్​డీఏకు 'మాస్టర్‌ ఫైల్‌' సమర్పించినట్లు ఓక్యూజెన్ తాజాగా వెల్లడించింది. అత్యవసర వినియోగ అధికారపత్రం(ఈయూఏ), బయోలాజిక్‌ లైసెన్స్‌ దరఖాస్తు(బీఎల్ఏ) ఆమోదం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఓక్యూజెన్ తెలిపింది. ఇక అమెరికాలో కొవాక్జిన్‌ అభివృద్ధి, సరఫరా, వాణిజ్య వినియోగానికి సంబంధించి ఫిబ్రవరి 2న భారత్‌ బయోటెక్‌తో ఓక్యూజెన్‌ ఒప్పందం చేసుకున్న‌ విష‌యం తెలిసిందే.  

Updated Date - 2021-05-25T20:29:46+05:30 IST