త్వరలో తెరుచుకోనున్న భారత్ గోల్డ్ మైన్స్!..

ABN , First Publish Date - 2021-10-11T19:33:58+05:30 IST

అనంతపురం జిల్లా: రాయలసీమ రతనాల సీమ. వజ్ర వైడుర్యాలేకాదు..

త్వరలో తెరుచుకోనున్న భారత్ గోల్డ్ మైన్స్!..

అనంతపురం జిల్లా: రాయలసీమ రతనాల సీమ. వజ్ర వైడుర్యాలేకాదు.. బంగారు నిక్షేపాలకు సయితం రాయలసీమ కేరాఫ్ అడ్రస్. ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లా, రామగిరిలో పసిడి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం జిగేల్ మన్న భారత్ గోల్డ్ మైన్స్ 20 ఏళ్ల క్రితం మూతపడింది. అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గోల్డ్ మైన్స్ తలుపులు తెరుచుకునేలా అడుగులు పడుతున్నాయి. దీంతో రాయలసీమలో మళ్లీ బంగారం వెలుగులు విరజిమ్మే అవకాశం కనిపిస్తోంది.


అనంతపురం జిల్లా అంటేనే గుర్తుకువచ్చేది కరువు కాటకాలు కాదు.. ఇక్కడ ఖనిజ సంపద కూడా. లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద అనంతపురం భూభాగంలో నిక్షిప్తమైంది. బంగారు నిలువలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాంటి ప్రాంతమే రామగిరి ప్రాంతం. ఇక్కడ వేల ఎకరాల్లో టన్నుల కొద్దీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సర్వేలు కూడా చేశారు. 1924లో భారత్ గోల్డ్ మైన్స్‌ను ఏర్పాటు చేసి కేజీలకొద్ది బంగారాన్ని వెలికి తీశారు. వందలమంది కార్మికులు పనిచేశారు. 15, 16 ఏళ్లు కొనసాగిన ఈ కంపెనీని మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ కంపెనీ ఉన్నఫలంగా మూసివేయడానికి కారణమేంటి? ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఈ కంపెనీ రావడమేంటన్నదానిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. ఈ వీడియో క్లిక్ చేయండి. 

Updated Date - 2021-10-11T19:33:58+05:30 IST