Abn logo
Sep 28 2021 @ 00:40AM

భారత్‌బంద్‌ విజయవంతం

ధర్మవరంలో రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులు

ధర్మవరం, సెప్టెంబరు 27: కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన భారత్‌బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ర్యాలీ గాంధీనగర్‌ సర్కిల్‌ నుండి ప్రారం భించిన టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ర్యాలీ నిర్వహి స్తూ దుకాణాలను, బ్యాంకులను బంద్‌ చేయించారు. అయితే ప్రభుత్వ కా ర్యాల యాలు, పాఠశాలలు, కళాశాలలు బంద్‌ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో  బస్టాండ్‌ అంత నిర్మాణుష్యంగా మారింది. అఖిల పక్షంలో నా యకులు నిర్వహించిన ర్యాలీ ఎన్టీఆర్‌, అంజుమన్‌, కళాజ్యోతి,  కాలేజ్‌ సర్కిల్‌ మీదుగా ఆర్టీసీబస్టాండ్‌ వరకు సాగింది. తిరిగి ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకుని అక్కడ బైఠాయించి కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ సం దర్భంగా అఖిలపక్ష పార్టీలనాయకులు మాట్లాడుతూ...రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టుచేసి సొంత పూచికత్తుపై విడుదల చేశా రు. ఈ కార్యక్రమంలో టీడీపీనాయకులు కమతంకాటమయ్య, మేకల రామాం జినే యులు, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసుపెద్దన్న, బోయ రవిచంద్ర, అంబటిసనత్‌, దేవరకొండ రామక్రిష్ణ,  రాంపురంశీన, జమీర్‌ అహమ్మద్‌,  డిష్‌లచ్చి, పఠాన్‌ బాబూ ఖాన్‌, భీమనేని ప్రసాద్‌ నాయుడు, చీమల రామాంజి, ముత్యాలప్ప నాయుడు, విజయసాఽరధిచౌదరి, చిగిచెర్ల రాఘవరెడ్డి, కత్తులబాబ్జీ, గంగారపురవి, చిన్నూరు విజ య్‌చౌదరి, మారు తీస్వామి, బిల్లేశీన, ఓంకార్‌, చీమలరామాంజి, గడ్డంశివ, కెహెచ్‌ ప్రకాశ్‌, అశ్వర్థనాయుడు, చీమల నాగారాజు, ఎస్సీ సెల్‌ నాయకుడు శివ కిరోసిన్‌ పోతలయ్య, అశోక్‌, ముత్యాలు, సీపీ ఎం నాయకులు పోలారామాంజినేయులు, ఎస్‌హెచ్‌బాషా, జంగాల పల్లిపెద్దన్న, అయూబ్‌ఖాన్‌, జేవీ రమణ, అయూబ్‌ఖాన్‌, ఎల్‌ ఆదినారాయణ, కొత్తపేటమారుతి, సీపీఐ నాయకులు నారా యణస్వామి, జింకా చలపతి, మధు, వై.రమణ, ఎమ్మార్పీ ఎస్‌ కేశగాళ్ల వెంకటేశ్‌, విద్యార్థిసంఘాల నాయకులు నాగార్జున, ప్రసాద్‌, సకలరాజ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

కదిరి: పట్టణంలో సోమవారం బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. పట్టణంలో ర్యాలీ చేసి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను, బ్యాంక్‌లను మూసివేయించారు. ప్రభుత్వం కూడా  మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ సంస్థలు  మూసివేశారు. స్థానిక అంబేడ్కర్‌ సర్కి ల్‌ వద్ద టీడీపీ, సీపీఐ రాస్తారోకో నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మో పూరి శెట్టి చంద్రశేఖర్‌, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు బాబ్‌ జాన్‌, టీడీపీ అధికార ప్రతి నిధి బండారు మనోహర్‌నాయుడు, టీడీపీ నాయకులు సులేమాన్‌, నాగ, వడ్డెబాబు, ఇమ్రాన్‌, బశెట్టి మహేంద్ర, ప్రకాశ్‌, పాల రమణ,  మనోహర్‌గౌడ్‌, ఎర్ర గుంటపల్లి చౌదరి, శేషు, నరసింహులు, డైమండ్‌ ఇర్ఫాన్‌, ఉమాదేవీ, గంగరత్నమ్మ, సీపీఐ జిల్లా నాయకులు వేమయ్యయాదవ్‌, రాజేంద్ర నాయుడు, లియాఖత్‌, కదిరప్ప, మధు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డాక్టర్‌ నాగన్న, సీపీఎం నాయకులు  జీఎల్‌ నరసింహులు, బడా సుబ్బిరెడ్డి, జగన్‌, హరినాథ్‌రెడ్డి, బహుజన ప్రజావేదిక నాయకులు అంపావతి గోవిందు, కుటాగుళ్ళ ప్ర సాద్‌, ప్రగతి శీల కార్మిక సమాఖ్య నాయకులు ఆర్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

పుట్టపర్తి: వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దుచేసేవరకు పోరాటాలు ఆగవని అఖిలపక్షనాయకులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం వ్యవ సాయ వ్యతిరేఖ చట్టాలను నిరసిస్తూ  చేపట్టిన బారత్‌బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, సీఐటీయి, రవాణారంగం, రైతు సం ఘం, నాయకులు పాల్గొని కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడు తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామాంజినేయిలు, మాజీమున్సిపల్‌చైర్మన్‌ బెస్తచలపతి, సామకోటి ఆదినారాయణ, గూడూరు ఓబుళేసు, దయ్యాల ఉమాపతి, మాలమనోహర్‌, ఆవులసుబ్రహ్మణ్యం, శేషు, బీవీనాయడు, బీవీప్రసాద్‌, ఒక్కలం శ్రీనివాసులు, రాజప్ప, సుబ్బరాయిడు, కాంగ్రెస్‌నాయకులు పుట్ల గంగాద్రి, సుబ్బయ్యచౌదరి, కోటాసత్యం, సీపీఎం, సీపీఐ, సీఐటీయి, రవా ణారంగం, రైతుసంఘం, నాయకులు రామకృష్ణ, రాము, గౌస్‌లాజం, రామాం జినేయిలు, బాబా వళి, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.