Bharat Gaurav's train: 21న భారత్‌ గౌరవ్‌ రెండో రైలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-28T15:34:00+05:30 IST

ట్రావెల్‌టైమ్స్‌, భారతీయ రైల్వే(Indian Railways) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, ఉలా రైల్‌ పేరుతో ‘గురు కృప షిర్డీ సాయిబాబా దర్శన్‌’ కోసం

Bharat Gaurav's train: 21న భారత్‌ గౌరవ్‌ రెండో రైలు ప్రారంభం

అడయార్‌(చెన్నై), జూలై 27: ట్రావెల్‌టైమ్స్‌, భారతీయ రైల్వే(Indian Railways) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, ఉలా రైల్‌ పేరుతో ‘గురు కృప షిర్డీ సాయిబాబా దర్శన్‌’ కోసం భారత్‌ గౌరవ్‌ పేరుతో ఓ రైలు నడుపనుంది. ఇప్పటికే ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన తొలి రైలు సర్వీసుకు 85 శాతం ప్రజల నుంచి స్పందన వచ్చింది. రెండో రైలు(Second train) ఆగస్టు 21న మదురై నుంచి ప్రారంభమై తిరుచ్చి, చెన్నై మీదుగా షిర్డీ(Shirdi) చేరుకోనుంది. మొత్తం 9 రోజుల పాటు సాగే ఈ ప్రయాణలో షిర్డీ, పండరీపురం, మంత్రాలయం, హైదరాబాద్‌, శనిసింగనాపూర్‌, త్రయంబకేశ్వరం, పంచవటి, స్టాట్యూ ఆఫ్‌ ఈక్విలిటీ (రామానుజం విగ్రహం) ప్రాంతాలను కలుపుతుంది. ఈ రైలులో 3 ఏసీ, స్లీపర్‌, 2 సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, 2 పాంట్రీ కార్స్‌, టూర్‌ మేనేజర్స్‌, కోచ్‌ సెక్యూరిటీ, బోగీల్లో సీసీ కెమెరాలు, పీఏ సిస్టమ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయిం. ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను 73058 58585 అనే నంబరులో తెలుసుకోవచ్చు లేదా ‘www.ularail.com'లో చూడొచ్చు. 

Updated Date - 2022-07-28T15:34:00+05:30 IST