Abn logo
Sep 24 2021 @ 15:46PM

ముందే పెరిగిన భారతీ ఎయిర్‌టెల్ షేర్లు

ముంబై : భారతి ఎయిర్‌టెల్ షేరు... ఇష్యూ తేదీకి ముందే... అంటే ఈ రోజు(శుక్రవారం) బీఎస్‌ఈలో ఇంట్రాడే ట్రేడ్‌లో మూడు  శాతం పెరిగి రూ. 747.6 కు చేరి, కొత్త గరిష్టాన్ని తాకింది. కంపెనీ రూ. 21 వేల కోట్ల రైట్స్ ఇష్యూను అక్టోబరు 5-అక్టోబరు 21 మధ్య కాలంలో ఆమోదానికి అనుమతించనుంది. ఈ సంస్థ బోర్డు... నిధుల సేకరణకు ఆగస్టులో...  ఆమోదం తెలిపింది. వాటాదారులకు ప్రతి 14 షేర్లకు ఒక షేర్‌ చొప్పున... రైట్ ఇష్యూలో కేటాయించనున్నారు.  రైట్స్ ఇష్యూలో జారీచేసే ఒక్కో షేర్ ధర రూ. 535 చొప్పున ఉంటుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఎయిర్‌టెల్‌ 5జీ సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాలని, భారత్‌లో డిజిటల్ వృద్ధికి వినియోగించాలని భావిస్తోంది. అక్టోబరు 5-అక్టోబర్ 21 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ చేయనున్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మంగళవారం, సెప్టెంబరు 28 న ఇష్యూలో రైట్స్‌ను స్వీకరించడానికి అర్హులైన వాటాదారులను నిర్ణయించనున్నారు.