పోలీసుల అదుపులో భార్గవరామ్‌?

ABN , First Publish Date - 2021-01-13T08:13:36+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

పోలీసుల అదుపులో భార్గవరామ్‌?

రహస్య ప్రదేశంలో విచారణ?

గోవా, ఏపీల్లో నలుగురి పట్టివేత

వారిలో ఇద్దరు వైసీపీ నేత కుమారులు

మిగతా నిందితుల ఆచూకీపై ఆరా

రెండోరోజు కొనసాగుతున్న అఖిల ప్రియ విచారణ


హైదరాబాద్‌ సిటీ/బేగంపేట్‌/విజయవాడ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్‌కుమార్‌, అతడి సోదరుల కిడ్నా్‌పలో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను అతడి నుంచి రాబడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా.. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 19 మంది నిందితులు అని గుర్తించగా.. అఖిల ప్రియ, సోమవారం అరెస్టయిన ముగ్గురితోపాటు.. తాజాగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవరామ్‌, గుంటూరు శ్రీను ఉన్నారు. పరారీలో ఉన్నవారంతా ఎక్కడ తలదాచుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మాత్రం.. భార్గవరామ్‌, గుంటూరు శ్రీను కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అయితే.. నిందితులను గుర్తించామని, ఏ క్షణంలో అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.


ఈ క్రమంలో హైదరాబాద్‌ ఉత్తర, పశ్చిమ మండలాల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం గోవాలో ఒకరిని, ఏపీలోని కృష్ణాజిల్లా కొండపల్లికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వరరావు కుమారులు వంశీ, సాయిహర్షతోపాటు టి.భాను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కిడ్నా్‌పలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు శ్రీను వీరికి కిడ్నాప్‌ స్కెచ్‌ గురించి వివరించి, హైదరాబాద్‌కు రప్పించినట్లు ఆధారాలు సేకరించారు. కాగా.. ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌ ప్రమేయం ఉన్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌ వ్యవహారంలో అతని డ్రైవర్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించారని తెలిసింది. అఖిలప్రియ అరెస్టు సమయంలోనూ.. పోలీసులు జగత్‌ విఖ్యాత్‌ను విచారించారు. 


బెంగళూరులో మంతనాలు

హఫీజ్‌పేట్‌ భూవివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు.. ప్రవీణ్‌ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ ఘటనకు కొన్ని రోజుల ముందు కూడా మీటింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ భేటీల్లో కొందరు పెద్దమనుషులు ఇరువర్గాల తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు.. వారెవరు? ఏయే అంశాలపై చర్చించారు? అనే కోణాలపై దృష్టిసారించారు. చర్చలు విఫలమవ్వడంతోనే కిడ్నాప్‌ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


రెండో రోజు కస్టడీ పూర్తి

కస్టడీలో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు రెండో రోజూ విచారించారు. మంగళవారం బేగంపేట మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ నేతృత్వంలో.. న్యాయవాదుల సమక్షంలో పలు అంశాలపై ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు ఆమెను ప్రశ్నించారు. భార్గవరామ్‌ సహా.. ఇతర నిందితులు ఎక్కడున్నారనే కోణంపై ఆమెను విచారించారు. చాలా ప్రశ్నలకు అఖిల ప్రియ మౌనంగా ఉన్నట్లు తెలిసింది. కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్‌ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్‌ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది. కాగా.. రెండు రోజులుగా బేగంపేట మహిళా పోలీ్‌సస్టేషన్‌లో అఖిల ప్రియ విచారణ సాగుతుండడంతో.. ఆ పీఎ్‌సలోని ఫిర్యాదుల విభాగాన్ని పోలీ్‌సక్వార్టర్స్‌కు మార్చారు.

Updated Date - 2021-01-13T08:13:36+05:30 IST