కుండపోత వర్షం

ABN , First Publish Date - 2021-11-29T05:41:27+05:30 IST

బంగాళాఖాతం లో శ్రీలంక తీరప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతోంది.

కుండపోత వర్షం
గూడూరు : చెన్నూరులో కురుస్తున్న వర్షం

రోజంతా ఎడతెరపి లేని వాన

జిల్లాలో సరాసరి వర్షపాతం 56.9 మి.మీ

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

నేడు, రేపు కూడా వర్ష సూచన


నెల్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతం లో శ్రీలంక తీరప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో జిల్లాలో   కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జి ల్లాలో సరాసరి వర్షపాతం 56.9 మిల్లీమీటర్లగా నమోదైంది. ఆదివారం ఉదయం తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. అ త్యధికంగా బుచ్చిరెడ్డిపాలెంలో 142.2 మి.మీ, ఆత్మకూరులో 105.8 మి.మీ వర్షం కురిసింది. కొడవలూరులో 97.2, సం గంలో 97, విడవలూరులో 96.6, నెల్లూరులో 94.4, కోవూ రులో 93, అల్లూరులో 86.8, నాయుడుపేటలో 80.6, అనంత సాగరంలో 75, ఇందుకూరుపేటలో 73.2, దొరవారిసత్రంలో 67.2, పొదలకూరులో 66.2, పెళ్లకూరులో 62.2, బాలాయ పల్లిలో 60.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సీతారామపురంలో10.8 మి.మీ వర్షం కురిసింది. భారీవర్షాల కారణంగా పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు తెగిపో యాయి. చేజర్ల మండలం గొల్లపల్లి వద్ద పందలవాగు ఉధృ తంగా రోడ్డుపై ప్రవహిస్తుండడంతో చేజర్ల, సంగం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో జిల్లాలోని లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరిం ది. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను ఈ వర్షాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. రానున్న రెండు రోజులు కూడా జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక దక్షిణ అండమాన్‌ సముద్రతీరంలో ఈ నెల 30వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఆ తదుపరి రెండు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశమున్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.కాగా సోమశిల జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఇన్‌ఫ్లో 96,107 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 87,000 క్యూసెక్కులుగా ఉంది.


పెన్నా కట్ట కోసుకుపోతోంది

లోతట్టు ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్న నది

భగత్‌సింగ్‌ కాలనీలోని 31 కుటుంబాల తరలింపు


నెల్లూరు (వెంకటేశ్వరపురం), నవంబరు 28 : పెన్నా వరద ఉధృతికి నది అంచున ఉండే కట్ట కోతకు గురవుతోంది. వరదకుతోడు భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతమైన భగత్‌సింగ్‌ కాలనీలో ఇసుక గట్టు నీటి ఒరవడికి కరిగిపోతోంది. దీంతో ఆ కాలనీలో 31 ఇళ్లలోని ప్రజలను అధికారులు ఆదివారం ఖాళీ చేయించారు. మంత్రి అనిల్‌ ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్‌ సఫియాబేగం, నాయకులు ముజీర్‌, అన్వర్‌, మునీర్‌, జమీర్‌ అధికారులు కలసి నిర్వాసితులను టిడ్కో అపార్ట్‌మెంట్లకు తరలించారు. భోజనాలు ఏర్పాటు చేశారు. 







Updated Date - 2021-11-29T05:41:27+05:30 IST