Abn logo
Sep 27 2021 @ 14:00PM

అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది మా ఇష్టం : భట్టి

హైదరాబాద్: రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి ఉందని ప్రభుత్వానికి చెప్పడం కోసం గుర్రపు బండిపై వెళ్లామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీకి ఏ విధంగా వెళ్లాలనేది సభ్యులుగా తమ ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. అసెంబ్లీకి హాజరుకాకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లామని భట్టి తెలిపారు. వాహనాలను తాము కూడా వాడలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. తమ అరెస్ట్ పై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.