కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-12-24T19:26:36+05:30 IST

బీజేపీ చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పర్యటించారు.

కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారు: భట్టి విక్రమార్క

ఖమ్మం: బీజేపీ చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటి టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పండిన పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డురంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటిపై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.ఖమ్మం జిల్లాలో వరి సాగుపైనే ఆధారపడి రైతులు జీవిస్తున్నారని వేరే పంటలు సాగు చేస్తే నష్ట పోతారని చెప్పారు.ఇప్పటికే మిర్చి, పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగానష్టపోయారని వాటికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. యాసంగిలో పంట కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ యాసంగిలో వరి వేయొద్దని చెపుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనుగోలు చేయాలని కోరడం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. జిల్లా మంత్రి ఇప్పటి వరకు యాసంగి వరి పంట సాగుపై మాట్లాడకుండా అధికారులతో మాట్లాడిస్తున్నారని రు. తెలంగాణలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

Updated Date - 2021-12-24T19:26:36+05:30 IST