భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కౌంటర్‌

ABN , First Publish Date - 2020-07-05T01:30:52+05:30 IST

కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కౌంటరిచ్చారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు

భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కౌంటరిచ్చారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొండపోచమ్మసాగర్‌ పనులు తాను చేసినట్టు నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే భట్టి విక్రమార్క రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాంట్రాక్ట్‌ ఎవరో కూడా తెలుసుకోకుండా ఆరోపణలు చేసిన భట్టి, షబ్బీర్‌ అలీపై న్యాయపరంగా ముందుకెళ్తానని ఉపేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-07-05T01:30:52+05:30 IST