భట్వాని

ABN , First Publish Date - 2021-07-31T18:39:49+05:30 IST

బ్లాక్‌ సోయాబీన్‌ - పావుకేజీ, రైస్‌ స్టార్చ్‌ - ఒక కప్పు, వేగించిన ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు -

భట్వాని

కావలసినవి: బ్లాక్‌ సోయాబీన్‌ - పావుకేజీ, రైస్‌ స్టార్చ్‌ - ఒక కప్పు, వేగించిన ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఆవాల నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం:  స్టవ్‌పై పాన్‌ పెట్టి ఒక టేబుల్‌స్పూన్‌ ఆవాల నూనె వేయాలి. కొద్దిగా వేడి అయ్యాక సోయాబీన్స్‌ వేసి వేగించాలి. చిటపటమని వేగే వరకు ఉంచి దింపుకోవాలి. కాస్త వేడిగా ఉండగానే బీన్స్‌ను క్రష్‌ చేసుకోవాలి. తరువాత రైస్‌ స్టార్చ్‌ కలపాలి. స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల ఆవాల నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తరువాత సోయాబీన్స్‌, రైస్‌ స్టార్చ్‌ వేసి కలుపుకోవాలి. పసుపు, గరంమసాల, తగినంత ఉప్పు వేయాలి. వేగించిన ఎండుమిర్చితో గార్నిష్‌ చేసి, అన్నంతో సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-07-31T18:39:49+05:30 IST