Sep 18 2021 @ 08:01AM

Bheemla nayak: ఈనెల 20న డానియెల్ శేఖర్ ప్రోమో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. ఇందులో డానియెల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానాకి సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్, 'భీమ్లా నాయక్' టైటిల్ అండ్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ రాగా, ఇటీవల విడుదలైన మొదటి పాట రికార్డ్స్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. దాంతో అందరు రానా పాత్రకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సంబందించిన అప్‌డేట్ ఇచ్చారు. 'బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్' ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.