‘భీమ్లా నాయక్’ అడవి తల్లి మాట.. పాట విడుదల ఎప్పుడంటే?

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మృతి కారణంగా వాయిదా పడిన ‘భీమ్లా నాయక్’ నాల్గవ సింగిల్ ‘అడవి తల్లి మాట’ను విడుదల చేసే వివరాలను తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, రానా దగ్గుబాటి సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫైట్ సన్నివేశానికి సంబంధించిన స్టిల్‌ ఇదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తుండగా మ్యూజిక్ సంచలనం థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 12, జనవరి 2022న విడుదలకానుంది.

Advertisement