Bheemla nayak: 'అడవి తల్లి మాట' సాంగ్ మరో బ్లాస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కే చంద్ర రూపొందిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీ నుంచి తాజాగా 'అడవి తల్లి మాట' అనే సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఎలా అయితే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయో.. తాజాగా వచ్చిన 'అడవి తల్లి మాట' కూడా అదే స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమనేలా ఉంది. కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి ఆలపించిన ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుకుంటున్నాయి. ఇక సాంగ్‌కు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందిచగా, థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ మెగా అభిమానులతో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.  


Advertisement