Abn logo
Oct 22 2021 @ 00:40AM

ఎన్టీపీసీని సందర్శించిన బీహెచ్‌ఈఎల్‌ డైరెక్టర్‌

ఎఫ్‌జీడీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న బీహెచ్‌ఈఎల్‌ డైరెక్టర్‌ కపూర్‌

- టీఎస్‌టీపీపీ పనుల పరిశీలన

జ్యోతినగర్‌, అక్టోబరు 21 : భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) డైరె క్టర్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ పవర్‌) అనిల్‌ కపూర్‌ గురువారం ఎన్టీపీసీలో పర్యటించారు. బీ హెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోని ఎస్‌జీ ఐలాండ్‌ ప్యాకేజీ, రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న ఫ్లూగ్యాస్‌ డీసల్ఫరైజే షన్‌(ఎఫ్‌జీడీ), ఆధునీకరణ(ఆర్‌అండ్‌ఎం) పనులను డైరెక్టర్‌ కపూర్‌ పరిశీలించారు. రెండు ప్రాజెక్టుల్లోని ఆయా లొకేషన్లలో పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కొత్త నిర్మాణ పనుల తీరు, ఎదురవుతున్న సవాళ్ల విషయంలో తీసుకోవాల్సిన చర్య లపై బీహెచ్‌ఈఎల్‌ డైరెక్టర్‌, ఎన్టీపీసీ సీజీఎం, ఇతర అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునిల్‌కువర్‌, ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, తన పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ బ్యాలెన్సిం గ్‌ రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్‌ డైరెక్టర్‌ అనిల్‌ కపూర్‌ పరిశీలించారు.