యూపీ రాజకీయాలు: శివపాల్‌ను కలిసిన భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్!

ABN , First Publish Date - 2021-08-28T12:10:00+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది పలు రాష్ట్రాలతోపాటు...

యూపీ రాజకీయాలు: శివపాల్‌ను కలిసిన భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది పలు రాష్ట్రాలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే పలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్‌ను కలుసుకున్నారు. వీరిద్దరూ యూపీ రాజధాని లక్నోలో సమావేశమయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నారనే వార్తలు రాష్ట్రంలో హల్‌చల్ చేస్తున్నాయి.


అయితే పొత్తుల గురించి నేతలిద్దరూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీనికిముందు చంద్రశేఖర్ ఒక కార్యక్రమంలో ఒవైసీ, రాజ్‌భర్‌ను కలుసుకున్నారు. ఎఐఎంఐఎం తొలిసారిగా వచ్చే ఏడాదిలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఇందుకోసమే ఒవైసీ పలువురు రాజకీయ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్‌పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేయాలని ఒవైసీ భావిస్తున్నానే వార్తలు వినిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో దళిత ఓట్లపై చంద్రశేఖర్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే మాయావతి... చంద్రశేఖర్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ‌ చేయాలని భావించడం లేదు. అయితే చంద్రశేఖర్ రాబోయే ఎన్నికల నాటికి ఏదోఒక పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-28T12:10:00+05:30 IST