ఎయిమ్స్‌కు యల్లాప్రగడ పేరుపెట్టండి

ABN , First Publish Date - 2021-10-17T05:13:03+05:30 IST

అమరావతిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్‌ అజయ్‌ కల్లాంను కోరారు.

ఎయిమ్స్‌కు యల్లాప్రగడ పేరుపెట్టండి
అజయ్‌ కల్లాంకు వినతిపత్రం అందజేస్తున్న రంగసాయి

అజయ్‌ కల్లాంకు రంగసాయి వినతి


భీమవరంటౌన్‌, అక్టోబరు 16 : అమరావతిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్‌ అజయ్‌ కల్లాంను కోరారు. ఈ మేరకు డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు జయం తి కమిటీ తరపున చెరుకువాడ రంగసాయి భీమవరం విచ్చేసిన ఆయనకు శనివారం వినతి పత్రం అందించారు.ప్రపంచ వైద్యరంగంలో ప్రతిష్టాత్మకమైన పరిశోధనలు జరిపి ప్రాణకోటికి జీవం పోశారన్నారు. ఆయన పేరు ఎయిమ్స్‌కు   సముచితంగా ఉంటుందన్నారు.దీనిపై స్పందించిన కల్లాం పరిశీలిస్తామన్నారు. 

Updated Date - 2021-10-17T05:13:03+05:30 IST