రోశయ్య రాజకీయాల్లో భీష్మాచార్యుడు: చిరంజీవి

రోశయ్య రాజకీయాలలో భీష్మాచార్యుడు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(89) కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఆయనకు సంతాపం తెలియజేశారు. "మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడి వంటివారు. ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యన్నత సాంప్రదాయాలు కాపాడటంలో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోషయ్య గారు. ఆయన కన్ను మూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.  


Advertisement