Oct 18 2021 @ 10:52AM

‘భోళా శంకర్’: వచ్చేవారం నుంచి లాంగ్ షెడ్యూల్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళా శంకర్’ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా లాంగ్ షెడ్యూల్‌ను చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. మెగాస్టార్ ‘భోళా శంకర్’మూవీలోని పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు గుండు లుక్‌తో వదిలిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.


అదే లుక్‌తో  ‘భోళా శంకర్’ మూవీలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మరో డిఫరెంట్ లుక్‌లో కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్‌కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించబోతున్నారు. మెహ‌ర్ రమేష్ తన సినిమాలలో హీరోలను చాలా స్టైలిష్‌గా చూపిస్తారు. మరి ఇందులో చిరును ఏరేంజ్‌లో చూపిస్తాడో.